Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! గణపతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ చెప్పారు. వాహనదారులు సహకరించి, తాము సూచించిన రూట్‌లో వెళ్లాలని కోరారు. By srinivas 07 Sep 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Traffic: గణపతి ఉత్సవాల కారణంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి గణేష్ నిమజ్జనాలు ముగిసే సెప్టెంబర్ 17 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని రోడ్లను పూర్తిగా మూసి వేయగా మరికొన్ని మార్గాల్లో సమయాలను కేటాయించారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఖైరతాబాద్ వచ్చే భక్తులు, సందర్శకులు.. నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు నుంచి రావాలని సూచించారు. భారీ అంబేద్కర్ విగ్రహం పక్కన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. #HYDTPinfo Commuters please make a note of the #TrafficAdvisory for Khairatabad #BadaGanesh ji. Devotees who visit Khairatabad #BadaGanesh please make note of Traffic Diversions & Parking places.#TrafficAlert #GaneshFestival@AddlCPTrfHyd pic.twitter.com/9rDn0YScvI — Hyderabad Traffic Police (@HYDTP) September 6, 2024 * ఖైరతాబాద్ రైల్వే గేటు నుంచి వచ్చేవారు దర్శనం అనంతరం ఐమాక్స్ థియేటర్ లేదా మిట్ కౌంపౌండ్ వైపు వెళ్లాలి. * మిట్ కౌంపౌండ్ నుంచి వచ్చేవారు ప్రభుత్వ పాఠ్య పుస్తక ముద్రణాలయం, వార్డు ఆఫీస్ ముందు నుంచి వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ మిట్ కౌంపౌండ్ వైపే వెళ్లాలి. * ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఐమ్యాక్స్ వెళ్లొచ్చు. మిట్ కౌంపౌండ్ వాహనాలకు అనుమతి లేదు. * ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ నుంచి రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ మీదుగా మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. * ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రాజ్‌దూత్ లేన్‌లో బడా గణేష్ దగ్గరికి నో ఎంట్రీ. ఇక్బాల్ మినార్ మీదుగా వాహనాలను డైవర్ట్ చేస్తారు. * ఇక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ వైపు వాహనాలకు అనుమతి లేదు. మింట్ కాంపౌండ్ ఎంట్రన్స్ వద్ద తెలుగుతల్లి జంక్షన్ వైపు మళ్లిస్తారు. * ఎన్‌టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్స్ నుంచి మింట్ కంపౌండ్ వైపు నో ఎంట్రీ, నెక్లెస్ రోటరీ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వైపు దారి మళ్లింపు. * నిరంకారీ ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ లేన్ మీదుగా ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు నో ఎంట్రీ. వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్ మీదుగా డైవర్ట్ చేస్తారు. పార్కింగ్ కోసం: ఐమాక్స్ పక్కన అంబేద్కర్ స్క్వేర్, ఎన్‌టీఆర్ గార్డెన్స్, సరస్వతి విద్యామందిర్, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ఏరియాలు కేటాయించారు. #hyderabad-traffic-alert #ganesh-chathurdhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి