WWE అభిమానులకు శుభవార్త.. రెజ్లింగ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్

WWE అంటే తెలియని వారుండరు. ప్రతి ఒక్కరు ఈ పోటీలను చాలా ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. అలాంటి WWE పోటీలకు తొలిసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.

New Update
WWE అభిమానులకు శుభవార్త..  రెజ్లింగ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్

Hyderabad to Host WWE Superstar Spectacle: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE)తెలుసు కదా. ఈ ఆట గురించి తెలియని వారుండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పోటీలను ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వారి లాగే కొట్టడం, వారి ఫేవరెట్ షాట్స్ వేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి స్టార్లను అభిమానులు దగ్గరిగా చూసే అవకాశం వస్తే ఇంకేముంది పరిగెత్తుతారు కదా. అయితే ఈ శుభవార్త మీకే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయితే ఇది మరింత ఆనందకరమైన విషయం. ఎందుకంటే WWE(World Wrestling Entertainment) పోటీలకు మన హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది.

హైద‌రాబాద్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 8 నుంచి డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ (WWE)సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ప్రారంభం కానుంది. గ‌చ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ రెజ్లింగ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. WWE పోటీలకు తొలిసారి మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఇండియాలో రెండోసారి ఈ ఈవెంట్ జరనుండడం విశేషం. 2017లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జ‌రిగాయి. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత భాగ్యనగరంలో జరగనున్నాయి. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వైఏటీ అండ్‌ సి డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ ఈ ఈవెంట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోటీల్లో అంత‌ర్జాతీయంగా ప్ర‌సిద్ధి చెందిన 28 మంది రెజ్లింగ్ స్టార్లు పాల్గొన‌నున్నారు.ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌, ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్ ది రింగ్ జనరల్ గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి స్టార్‌లు ఇందులో పోటీప‌డ‌నున్నారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్న ఈ ఈవెంట్ టికెట్లు www.bookmyshow.com ద్వారా బుక్ చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో "ఇండియా సిద్ధమా.. హైదరాబాద్ వచ్చేస్తున్నాం.." అంటూ ఈ ఈవెంట్ గురించి సూపర్ స్టార్స్ వీడియోలు విడుదల చేస్తున్నారు.

Also Read: తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు

Advertisment
తాజా కథనాలు