Hyderabad: నెలకు రూ.18లక్షల సంపాదన.. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ గురించి తెలిస్తే షాకే!

కుమారి ఆంటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. 2011లో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా 5 కేజీల రైస్‌తో స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు రోజుకు క్వింటాల్ రైస్ అమ్ముతున్నారు. రూ.100కే నాన్ వెజ్ అందిస్తూ నెలకు రూ.18లక్షలకు పైగా సంపాదిస్తున్నారు.

Hyderabad: నెలకు రూ.18లక్షల సంపాదన.. కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ గురించి తెలిస్తే షాకే!
New Update

KUMARI AUNTY: కుమారి ఆంటీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ధమ్ బిర్యానీకి (Biryani) ఫేమస్ గా మారిన హైదరాబాద్ ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ (Street food) లోనూ చాలా ఫేమస్ అయింది. అంతేకాదు రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు నిరుద్యోగులు. అలాంటి వారిలో కుమారీ ఆంటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటున్న కుమారీ ఆంటీ సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీగానూ మారిపోయింది. ప్రస్తుతం ఏ హోటల్ లో కూర్చున్న ఆమె గురించే చర్చ నడుస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్, య్యూటూబ్ వేదికల్లోనూ ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. హోటల్ ధరలకంటే తక్కువకే బోటీ, చికెన్, మటన్, లివర్ వంటి స్పెషల్ వంటకాలను సర్వ్ చేస్తూ ట్రెండ్ సెట్టర్ గా మారిన కుమారీ ఆంటీ.. సాఫ్ట్ వేర్లకు మించి సంపాదిస్తూ ఔరా అనిపిస్తోంది. మరి ఆమో ఆదాయం, ఖర్చు గురించి మనమూ తెలుసుకుందాం.

2011లో ప్రారంభం..

ఈ మేరకు ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి.. 2011లో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ ఎదురుగా స్ట్రీట్‌ఫుడ్‌ బిజినెస్‌ మొదలుపెట్టింది. చవకైన ధరలకే వెజ్‌, నాన్‌వెజ్‌ వంటకాలను సర్వ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. మొదట 5 కేజీల రైస్‌తో ప్రారంభమైన కుమారి బిజినెస్‌.. తన రుచికరమైన వంటకాలతో ఈ రోజు క్వింటాలుకు పైగా రైస్ అమ్మడుపోయే కస్టమర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే కొంతమంది యూట్యూబర్స్ ఆమెపై వీడియోలు చేయడం మొదలుపెట్టడంతో కుమారీ కూడా ఒక సెలబ్రెటీగా మారింది.

రూ.100కే నాన్ వెజ్..

ఇక కేవలం రూ.100కే చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, బోటీ కర్రీ, ఫిష్‌ కర్రీ, ఫిష్‌ ఫ్రై వడ్డిస్తూ కస్టమర్లను అకర్షించింది. నాన్‌ వెజ్‌లో రెండు కర్రీలు తీసుకుంటే ప్లేటు రూ.150, మూడు తీసుకుంటే రూ.200 అలా ఐటెమ్‌ను బట్టి రేటు ఫిక్స్ చేసింది. అలా మొదట్లో వంద, రెండువందల మందికి భోజనం వడ్డించే కుమారి దగ్గరకు ఇప్పుడు ఏకంగా రోజుకు 600 వందల మంది కస్టమర్స్‌ వస్తున్నారని చెప్పింది. రోజుకు కనీసం ఒక ప్లేట్ 100 రూపాయలు లెక్కన వేసుకున్నా చూసినా.. ప్రతిరోజు రూ. 60వేల వరకూ ఆదాయం వస్తున్నట్లు తెలిపింది. ఇక ఒక నెలకు దాదాపు రూ.18 లక్షలు సంపాదిస్తున్న కుమారీ.. రూ.12 లక్షలు సరుకులకు అయ్యే ఖర్చులు తీస్తే అటు ఇటుగా రూ. 6 లక్షల వరకు మిగులుతున్నట్లు చెబుతోంది.

ఇది కూడా చదవండి : AUS vs WI: ఛాంపియన్ ను చావు దెబ్బతీసిన వెస్టిండీస్.. 36 ఏళ్ల తర్వాత తొలి విజయం

మధ్యాహ్నం 12 నుంచి 3..

ఇక ఈ ఫుడ్ బిజినెస్ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 3 గంటలకు క్లోజ్ అవుతుందని చెప్పింది. వెజ్ లో వైట్‌ రైస్‌, బగారా రైస్‌, గోంగూర రైస్‌, టమాటా రైస్‌, లెమన్‌ రైస్‌, జీరా రైస్‌ గోబీ రైస్‌, పెరుగన్నం వంటి ఐటెమ్స్‌ సర్వ్ చేస్తుంది. నాన్‌వెజ్‌లో చికెన్‌ కర్రీ, చికెన్‌ ఫ్రై, లివర్‌ కర్రీ, బోటీ కర్రీ, మటన్‌ లివర్‌, మటన్‌ హెడ్‌, మటన్‌ కర్రీ, ఫిష్‌ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్‌ కర్రీని సేల్‌ చేస్తు్న్నట్లు చెప్పింది.

సీనీ తారలు సైతం..

ఇక కుమారీ కష్టమర్లు తక్కువ ధరలకే రుచికరమైన ఫుడ్‌ అందిస్తోందని పొగిడేస్తున్నారు. రెస్టారెంట్లకు మించి టేస్ట్ ఉంటుందని, సినీ సెలబ్రిటీలు హీరో సందీప్‌ కిషన్‌ వంటి వాళ్లు కూడా ఆమె దగ్గర భోజనం చేసినట్లు చెబుతున్నారు. కుమారి ఆంటీ అందించే రుచికరమైన ఆహారాన్ని తినేందుకు హైదరాబాద్‌ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం ఫుడ్‌ లవర్స్‌ తరలివస్తున్నారు.

ఇంట్లోనే సిద్ధం..

ఇక కుమారీ ఈ వంటకాలన్నీ ఇంట్లోనే వండుకుని తీసుకొస్తుంది. సరిగ్గా 12 గంటల వరకూ అడ్డలో స్టాల్ ఓపెన్ చేస్తుంది. వంటల్లోకి కావలసిన మసాలా దినుసులు అన్నీ ఆమె స్వయంగా ఇంట్లోనే చేసుకుంటారట. ఇంట్లో వాళ్లంతా కలిసి తలో చెయ్యి వేసుకుని వంట పూర్తి చేస్తారట. అందుకే వారి వంటకి అంత డిమాండ్ అంటున్నారు నెటిజన్లు.

#street-food #kumari-aunty #hyderabad
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe