ఇక వీలునామా మరింత ఈజీ.... కొత్త ఆలోచనతో ముందుకు వచ్చిన స్టార్టప్ కంపెనీ..!

ఇక నుంచి వీలునామా చేయించేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. కూర్చున్న చోటు నుంచే వీలునామా రాయించవచ్చు. ఆస్తుల వివరాలు, వీలునామా ఎవరి పేరటి రాయాలో చెబితే తామే సులభంగా తయార చేస్తామని హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ చెబుతోంది. మరణాంతరం మీ వీలునామాను వీడియో రూపంలో మీ వారసులకు అందజేస్తామని చెబుతోంది.

author-image
By G Ramu
ఇక వీలునామా మరింత ఈజీ.... కొత్త ఆలోచనతో ముందుకు వచ్చిన స్టార్టప్ కంపెనీ..!
New Update

మనలో చాలా మందికి వీలునామా(will) గురించి అవగాహన ఉండదు. ఆ వీలునామా ఎలా చేయాలో తెలియక ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తారు. దీంతో మనం చేసిన తప్పు మరణాంతరం మన వాళ్లను ఇబ్బంది పెడుతుంది. ఆస్తులు(assets) నావంటే నావని అన్నదమ్ములు మధ్య పోట్లాటలు మొదలవుతాయి. తల్లీ-కొడుకుల మధ్య తగవు తీసుకు వస్తుంది. కొన్ని సార్లు సరైన వారసులు లేనప్పుడు అలాంటి ఆస్తులు అన్యాక్రాంతం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.

ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ టెక్ స్టార్టప్ ఒకటి కొత్త రకం ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇక నుంచి వీలునామా రాయాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు అని చెబుతోంది. ఉన్న చోట నుంచి తమ యాప్ ఓపెన్ చేసి వివరాలు అందిస్తే తామే వీలునామా రెడీ చేసిస్తామంటోంది. అత్యంత తక్కువ ఖర్చుతో వీలునామా ప్రిపేర్ చేయిస్తామని చెబుతోంది.

ఎలా వచ్చింది ఈ ఆలోచన....!

విశాల్ మెహతా ... సింగపూర్‌లో మైక్రో సాఫ్ట్ కంపెనీలో పని చేసేవారు. ఐఐటీ కోల్ కతాలో తనతో పాటు చదువుకున్న మిత్రుడు ఒకరు కొవిడ్-19 సమయంలో అకాల మరణం పొందారు. ఆ మిత్రునికి రెండేండ్ల కూతురు ఉంది. ఆయన ఆస్తుల నిర్వహణ సరిగా లేకపోవడం, వీలునామా చేయకపోవడంతో ఆయన ఆస్తుల వివరాల గురించి వాళ్ల కుటుంబ సభ్యులకు సరైన అవగాహన లేకుండా పోయింది.

ఆ సమయంలోనే ఆస్తుల నిర్వహణ, వీలునామా ప్రాధాన్యతను విశాల్ మెహత గుర్తించారు. అయితే వీలునామా చేయించడం అంతా ఈజీ కాదని ఆయన గుర్తించారు. దీంతో వీలునామాను రెడీ చేసేందుకు ఏదైనా ఆన్ లైన్ ప్లాట్ పారమ్ వుంటే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. వెంటనే అశ్విన్ జైన్ అనే మరో స్నేహితునితో కలిసి మిట్ ఆర్వ్ అనే యాప్ తయారు చేశారు.

మిట్ ఆర్వ్(Mitt Arv)యాప్...!

‘మిట్ ఆర్వ్’ అంటే స్వీడీష్ భాషలో ‘వారసత్వం’ అని అర్థం. వినియోగదారులు తమ వీలునామా ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ యాప్ ను తయారు చేశారు. వినియోగదారులు తమ ఆస్తులను నిర్వహించేందుకు, భావోద్వేగ వీలునామాలను సులభంగా సృష్టించేందుకు అనుమతించే ప్లాట్‌ఫారమ్‌ను అందించడం ద్వారా వీలునామాను సులభతరం చేయాలన్ని ఈ యాప్ లక్ష్యంగా పెట్టుకుంది.

యాప్ లో రెండు అద్భుతమైన ఫీచర్స్...!

ఈ యాప్‌లో ఎమోషనల్ విల్, అసెట్ వ్యాలెట్ అనే రెండు ఫీచర్స్ వున్నాయి. ఇందులో ఎమోషనల్ విల్ అనే ఫీచర్ ద్వారా మన వీలునామాను టెక్ట్, ఆడియో లేదా వీడియో రూపంలో వారసులకు షేర్ చేయవచ్చు. ఆ వీలునామాను వారసులకు ఎప్పుడు చేరాలన్నది కూడా మనం ముందస్తుగా నిర్ణయించ వచ్చు. ముందస్తుగా ఎంపిక చేసుకున్న వివరాల ప్రకారం... ఆ వీలునామాను మనం అనారోగ్యంగా వున్నప్పుడు లేదా మరణాంతరం మనం ఎంపిక చేసుకున్న కాంటాక్ట్ కు ఆ వీలునామాను షేర్ చేస్తుంది.

ఇక అసెట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ద్వారా వినియోగదారులు తమ ఆస్తుల వివరాలను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనం కొత్త ఆస్తులు కొన్నప్పుడు, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకున్నప్పుడు ఈ ఆప్షన్ ద్వారా అందులో యాడ్ చేసుకోవచ్చు. దీంతో ఆస్తుల నిర్వహణ సులభంగా మారుతుందని యాప్ నిర్వహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్ ఫారమ్ లో బీటా వర్షన్ లో అందుబాటులో ఉందని నిర్వహకులు చెబుతున్నారు.

#assets #legal-problems #will #mitt-arv #online-will #start-up-company
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe