Hyderabad: ఓయో హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు.. నిందితుడి ఫోన్‌లో వందల న్యూడ్ వీడియోలు..!

శంషాబాద్ సిటా గ్రాండ్ ఓయో హోటల్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. బెడ్ రూంలలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల అశ్లీల దృశ్యాలను రికార్డు చేసి నిర్వాహకుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి ఫోన్‌లో వందల న్యూడ్ వీడియోలు బయటపడ్డాయి.

Hyderabad: ఓయో హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు.. నిందితుడి ఫోన్‌లో వందల న్యూడ్ వీడియోలు..!
New Update

Hyderabad: హైదరాబాద్ లోని శంషాబాద్‌ సిటా గ్రాండ్ ఓయో హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హోటల్‌కు వస్తున్న జంటల అశ్లీల చిత్రాలను నిర్వాహకుడు సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేసి బాధితులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. పోలీసులకు ఓ జంట ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: వివాదస్పదంగా మారిన పోలీసుల తీరు..!

ఒంగోలుకు చెందిన గణేష్ అనే వ్యక్తి శంషాబాద్‌ సిటా గ్రాండ్ సమీపంలో ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. బెడ్ రూమ్‌లోని బల్బ్ లలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల అశ్లీల దృశ్యాలను రికార్డు చేసి.. రికార్డులో ఉన్న వారి వివరాలు ఆధారంగా ఫోన్లు చేసి వారిని బ్లాక్ మెయిట్ చేసేవాడు. అడిగినంత ఇవ్వకుంటే ఆ జంట న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుండేవాడు.


Also Read: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే భర్త.. అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌..!

ఇలా ఓ జంటను బెదిరించగా వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు హోటల్‌లో సీక్రెట్‌ కెమెరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడి ఫోన్‌లో వందల న్యూడ్ వీడియోలు, చాలా మంది అమ్మాయిల న్యూడ్ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

#oyo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe