అందం కోసం, జుట్టు(hair) కోసం బ్యూటీ పార్లల్(beauty parlour)కి వెళ్తున్నారా? అక్కడ బ్యూటిషియన్లు రిఫర్ చేసే ప్రొడక్ట్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఉన్నది కూడా ఊడుతుంది.. జుట్టు షార్ట్‌గా ఉండాలని, మోడ్రన్‌గా కనిపించాలని అడ్డదిడ్డమైన హెయిర్ ఆయిల్స్(hair oils) వాడితే అంతే సంగతి.. ఉన్న జుట్టు పోయి గుండు కనిపిస్తుంది. అందం పోయి చర్మ సమస్యలు మొదలువుతాయి. అందం కోసం ఆవేశ పడకండి.. ఆలోచించండి..డబ్బు తగలేయకండి.. కావాలంటే హైదరాబాద్ పాతబస్తీలో ఏం జరిగిందో తెలుసుకోండి.. అప్పుడు మీకు తత్వం బోధపడుతుంది. భార్యభర్తల మధ్య బ్యూటి పార్లర్ చిచ్చు పెట్టింది. పోలీస్‌స్టేషన్ గడప తొక్కేలా చేసింది.
అసలేం జరిగిందంటే?
ఓల్డ్ సిటీ(old city)లో నివాసిస్తున్న ఓ భార్యభర్తల మధ్య బ్యూటీపార్లల్ చిచ్చు పెట్టింది. తన భార్య మోడ్రన్‌గా కనిపించాలని కోరుకున్నాడు భర్త. ఈ విషయాన్ని పదేపదే అమెకు చెబుతూ వస్తున్నాడు. భర్త కోరిక తీర్చాలని ఆమె భావించింది. అబిడ్స్‌లోని క్విన్జ్ పార్లల్‌కు వెళ్లి తనకు ఏం కావాలో చెప్పింది. అయితే ముందుగా హెయిర్ కట్ చేసుకోవాలని.. తర్వాత ఓ ఆయల్ జుట్టుకు అప్లై చేస్తామని అక్కడి బ్యూటిషియన్ చెప్పడంతో అందుకే ఓకే చెప్పింది. ముందుగా ఆమె హెయిర్ కొంచెం కట్ చేశారు.. తర్వాత ఆయిల్ అప్లై చేశారు. అంతే.. వెంటనే ఆమె జుట్టు ఊడిపోవడం మొదలుపెట్టింది. స్టార్టింగ్‌లో అలానే ఉంటుందని నిర్వాహకులు సర్థి చెప్పి ఇంటికి వెళ్లిపోమన్నారు.
ఇంటికి చేరుకున్న తర్వాత కూడా జుట్టు రాలడం ఆగలేదు.. ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయే స్టేజీకి వచ్చేసింది. దీంతో భర్తకు ఒళ్లు మండిపోయింది. ఏం చేయమంటే ఏం చేశావ్ అంటూ చిందులేశాడు. తన తప్పు లేకపోయినా భర్త తిడుతుండడంతో సహించలేకపోయిన భార్య గొడవ పడింది. ఇది కాస్త పెద్దదైంది. ఊడిపోయిన జుట్టుతో భార్యాభర్తలు పోలీస్‌స్టేషన్‌కి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. పార్లల్ నిర్వాహకులపై బాధితురాలి ఫిర్యాదు చేసింది. దీంతో సీన్‌లోకి దిగిన పోలీసులు బ్యూటీపార్లర్‌కి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే నిర్వాహకులు దుకాణం సర్దేశారు.. పారిపోయారు.. బాధితురాలు ఫిర్యాదు చేస్తుందని ముందుగానే భావించిన యాజమాన్యం అక్కడ నుంచి ఎస్కెప్ అయ్యింది. ఇక ఇలాంటి ఘటనలు హైదరాబాద్(hyderabad)లో జరగడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక ప్రాంతాల్లో పార్లల్ నిర్వహకులు ఇలానే చేశారు. పొడుగ్గా ఉన్న జుట్టు కత్తిరించడం.. ఆయిల్ పెట్టడం.. వెంటనే బాధితుల హెయిర్ ఊడిపోవడం.. తర్వాత పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అవ్వడం సర్వసాధారణమైపోయింది. అందుకే పార్లల్‌కి వెళ్లాలంటేనే చాలా మంది అమ్మాయిలు జంకుతున్నారు.