Raj Bhavan Road Closed: తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని , ఈ సమయంలో బయటకు వస్తే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యులు తెలిపారు. తన కోసం వచ్చే వారితో యశోద హాస్పిటల్ (Yashoda hospital) ఉన్న ఇతర పేషెంట్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) అన్నారు. అందుకే తనను చూసేందుకు కానీ, కలిసేందుకు కానీ ఎవరూ రావద్దని కేసీఆర్ అన్నారు.
అయినప్పటికీ కూడా బీఆర్‌ఎస్ శ్రేణులు(BRS), కేసీఆర్ అభిమానుల రద్దీ ఆసుపత్రి వద్ద తగ్గలేదు. దీంతో చేసేదేమీ లేక ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లే రహదారిని ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. ఖైరతాబాద్ తో పాటు పంజాగుట్ట వైపు నుంచి రాజ్ భవన్ రోడ్డులోకి ప్రవేశించే ప్రాంతాల్లో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే కేవలం కేసీఆర్ ని చూడటానికి యశోద ఆసుపత్రికి వచ్చే వారినే కాకుండా రాజ్ భవన్ మార్గంలో డైలీ జర్నీ చేసే వారిని కూడా పోలీసులు నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఖైరతాబాద్- పంజాగుట్ట మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తనను చూసేందుకు ఆస్పత్రికి రావద్దని కోరుతూ మంగళవారం కేసీఆర్ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సిద్దిపేట, గజ్వేల్ తో పాటు కేసీఆర్ స్వగ్రామం చింతమడక నుంచి యశోద ఆసుపత్రికి పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తున్నారు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారిని లోనికి అనుమతించకపోవడంతో వారు ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు.
కేసీఆర్ ని కలిసే అక్కడ నుంచి వెళ్తామని వారు తెలిపారు. దీంతో పోలీసులు, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వారికి వివరించి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేయడంతో వారు శాంతించారు. అక్కడ నుంచి ఆందోళన విరమించి వెళ్లిపోయారు.
Also read: కీరవాణీ ఇంటి కోడలిగా మురళీమోహన్ మనవరాలు..పెళ్లి ఎప్పుడంటే!