Driving Tips: పొగమంచు సమయంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

పొగమంచు కారణంగా తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని దుస్థితి ఏర్పడింది. అందుకే యాక్సిడెంట్లకు గురికాకుండా వీలైనంత తక్కువ వేగంతో డ్రైవ్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. బైక్‌లు, హెల్మెట్‌లకు రిఫ్లెక్టివ్ టేపులను అతికించాలని సూచిస్తున్నారు.

Driving Tips: పొగమంచు సమయంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
New Update

చలికాలం(Winter Season) చంపేస్తోంది. పెరిగిన చలికి ప్రజలు గజగజా వణికిపోతున్నారు. స్వెటర్‌ లేకుండా బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ధైర్యం చేసి బయటకు వచ్చినా... స్వెటర్‌ ధరించినా వణుకుడు మాత్రం ఆగడంలేదు. ఇదేం చలిరా బాబోయ్‌ అని చాలా కూల్‌ ఫీల్ అవుతున్నారు. చాలా మందికి ఏ మంటల దగ్గర చాలి కాచుకోని అక్కడే తిని పడుకోవాలనిపిస్తోంది. అయితే ఆ పని చేయలేరు.. ఎందుకంటే స్కూల్‌కి, కాలేజీకి లేదా ఆఫీస్‌కో, పనికో పోవాలి. మంటల దగ్గర కూర్చుంటే చలి తగ్గుతుందేమో కానీ డబ్బులు రావు.. అందుకే బైక్‌ వేసుకోని డ్యూటీకి పోవాల్సిందే. అలా బైక్‌పై రయ్‌ రయ్‌మని వెళ్లలేక.. గంటకు 30-40కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు ప్రజలు. ఇక ఎర్లీ మార్నింగ్‌ లేదా నైట్‌ డ్రైవింగ్‌ చేసేవాళ్లకి ఇటీవలి కాలంలో కళ్లు సరిగ్గా కనిపించడంలేదు. ఐ సైట్‌ బాగానే ఉన్నా మంచు దేవుడు కళ్లను కప్పేస్తున్నాడు. అందుకే వాహనాలు ఒకదానికి మరొకటి ఢీకొంటున్నాయి. ఇది చాలా ప్రమాదం.. లైఫ్‌ డేంజర్‌లో పడినట్టే. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయ్. అందుకే వాహనదారులను పోలీసులు అలెర్ట్ చేస్తున్నారు. సూచనలు, జాగ్రత్తలు చెబుతున్నారు.

ఎల్లో అలెర్ట్ జారీ:

దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సమయాల్లో వాహనాదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు పోలీసులు అన్ని రహదారులపై, ముఖ్యంగా శివార్లలోని రిఫ్లెక్టర్ స్టడ్‌లు, సంకేతాలను అమర్చారు. డ్రైవర్లు కనీస వేగాన్ని నిర్వహించాలని పోలీసులు చెబుతున్నారు. చాలా మంది వ్యక్తులు హెడ్‌లైట్లు పని చేస్తున్నాయని నిర్ధారించుకుంటారు కానీ టెయిల్ ల్యాంప్‌లను పట్టించుకోరని పోలీసులు అంటున్నారు. అయితే పొగమంచుతో కూడిన పరిస్థితుల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనాలకు మీ వాహనం కనిపించడానికి టెయిల్ ల్యాంప్‌లు చాలా ముఖ్యమైనవి.

ట్రాఫిక్ పోలీసులు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే?

➼ వీలైనంత తక్కువ వేగంతో డ్రైవ్/రైడ్ చేయండి.

➼ ఓవర్‌టేక్ చేయవద్దు.

➼ బైక్‌లు, హెల్మెట్‌లకు రిఫ్లెక్టివ్ టేపులను అతికించండి.

➼ భారీ వాహనాల కోసం, రిఫ్లెక్టివ్ టేప్‌లు వెనుక భాగంలో ఎరుపు, పసుపు లేదా నారింజ రంగులో ఉండాలి.. ముందు తెల్లగా ఉండాలి.

Also Read: ‘నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. చాలా బాధపడ్డా..’ కేఎల్‌రాహుల్‌ ఎమోషనల్‌!

WATCH:

#hyderabad #winter #police
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe