Kurchi Thatha: కుర్చీ మడత పెట్టేసిన పోలీసులు.. కాలా పాషా అలియాస్‌ కుర్చీ తాత అరెస్టు

కుర్చీ మడత పెడతానంటూ సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కుర్చీ తాత అలియాస్‌ కాలా పాషాను పోలీసులు అరెస్టు చేశారు. కుర్చీ తాతను థమన్ వద్దకు తీసుకెళ్లిన వైజాగ్ సత్యతో పాటు స్వాతి నాయుడు ఫిర్యాదు చేయడంతో పాషాను అరెస్టు చేసినట్టు తెలిపారు.

Kurchi Thatha: కుర్చీ మడత పెట్టేసిన పోలీసులు.. కాలా పాషా అలియాస్‌ కుర్చీ తాత అరెస్టు
New Update

Kurchi Thatha: కుర్చీ తాత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు కదా.. కుర్చీ మడత పెడతానంటూ సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కుర్చీ తాత అలియాస్‌ కాలా పాషాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కుర్చీ తాతను థమన్ వద్దకు తీసుకెళ్లిన వైజాగ్ సత్యతో పాటు స్వాతి నాయుడు ఫిర్యాదు చేయడంతో పాషాను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గతంలో వైజాగ్ సత్య ఉప్పల్ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: ఎదురే లేని సూర్య.. మరోసారి టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ‘మిస్టర్‌ 360’

గుంటూరు కారం సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'ఆ కుర్చీ మడత పెట్టీ...' అంటూ అదే టైటిల్‌తో బ్లాక్ బస్టర్ పాట ట్యూన్‌చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిన వైజాగ్‌ సత్య స్వయంగా కుర్చీ తాతను తమన్ దగ్గరికి తీసుకెళ్లి ఆర్థికసాయం అందించేలా చొరవ తీసుకున్నాడు. అయితే, తానే డబ్బులు కాజేశానంటూ తనపై కుర్చీ తాత తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ సత్య పోలీసులు ఫిర్యాదు చేశాడు. తనను బూతులు తిడుతూ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. వైజాగ్‌ సత్య కనిపిస్తే నరికేస్తానంటూ కామెంట్‌ చేస్తున్నాడని పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ వాసులకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఉప్పల్ తరహాలో అక్కడ మరో స్కై వాక్..!!

తమన్‌ను కలిసినట్టుగానే మహేశ్‌ బాబు అప్పాయింట్‌మెంట్‌ కూడా ఇప్పించాలంటూ కుర్చీ తాత పట్టుబట్టాడట. అయితే అది తనవల్ల కాదంటూ వైజాగ్ సత్య స్పష్టంగా చెప్పేయడంతో వారిద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయట. ఇక అప్పటి నుంచి యూట్యూబ్‌లో తనపై కాలా పాషా బూతులు మొదలు పెట్టాడంటున్నాడు సత్య. వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

#kurchi-thatha #kurchi-thata-arrest #vizag-satya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe