/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Spa-Prostitution-.jpg)
హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ రోజు రెండు స్పా సెంటర్లపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఓ అపార్ట్‌మెంట్‌లో గుట్టుగా వ్యభిచారం సాగుతోందని తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. రెండో అంతస్తులో ఒక స్పా సెంటర్, నాల్గో అంతస్తులో మరో సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఏడుగురు యువతులు, నిర్వాహకుడు రూబీని పోలీసులు అరెస్ట్ చేశారు. విటుడు ఆదిత్యను సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.