Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!

హైదరాబాద్ వాసులకు కీలక అలర్ట్. ముసారాంబాగ్ బ్రిడ్జిని క్లోజ్ చేశారు అధికారులు. నిర్మాణ పనుల కారణంగా ఆ బ్రిడ్జిని మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!
New Update

Hyderabad Traffic Alerts: హైదరాబాద్ వాసులకు అలర్ట్. ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి అంబర్‌పేట్, విద్యానగర్, ఓయూ, తార్నాక, సికింద్రాబాద్ రూట్‌ వెళ్లే ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై ఉన్న ఫ్లై ఓవర్‌ను మూసివేశారు. నేటి ఈ బ్రిడ్జి మూసివేయడం జరుగుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముసారాంబాగ్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున.. ఈ దారిని మూసివేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదకగా పోస్ట్ చేశారు.

ఈ ప్రకటన ప్రకారం.. అంబర్‌పేట్ నుండి మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ మీదుగా మలక్‌పేట టీవీ టవర్, దిల్‌సుఖ్ నగర్ వైపునకు వెళ్లే అన్ని వాహనాలను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ నుంచి జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్ నుంచి మళ్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ బ్రిడ్జ్ నుంచి యూటర్న్ తీసుకుని.. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద రైట్ టర్న్ తీసుకుంటే.. మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లేందుకు అవకాశం ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.

Also Read:

హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఢిల్లీలో లాగా బేసి, సరి రూల్?

సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!!

#hyderabad-traffic-restrictions #hyderabad-traffic-alert #moosarambagh-bridge
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి