/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Moosarambagh-bridge-jpg.webp)
Hyderabad Traffic Alerts: హైదరాబాద్ వాసులకు అలర్ట్. ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్ నుంచి అంబర్‌పేట్, విద్యానగర్, ఓయూ, తార్నాక, సికింద్రాబాద్ రూట్ వెళ్లే ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. ముసారాంబాగ్ వద్ద మూసీ నదిపై ఉన్న ఫ్లై ఓవర్‌ను మూసివేశారు. నేటి ఈ బ్రిడ్జి మూసివేయడం జరుగుతుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముసారాంబాగ్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున.. ఈ దారిని మూసివేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదకగా పోస్ట్ చేశారు.
ఈ ప్రకటన ప్రకారం.. అంబర్‌పేట్ నుండి మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ మీదుగా మలక్‌పేట టీవీ టవర్, దిల్‌సుఖ్ నగర్ వైపునకు వెళ్లే అన్ని వాహనాలను అలీ కేఫ్ ఎక్స్ రోడ్ నుంచి జిందాతిలిస్మత్, గోల్నాక న్యూ బ్రిడ్జ్ నుంచి మళ్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ బ్రిడ్జ్ నుంచి యూటర్న్ తీసుకుని.. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద రైట్ టర్న్ తీసుకుంటే.. మూసారాంబాగ్ జంక్షన్ వైపు వెళ్లేందుకు అవకాశం ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా వాహనదారులు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.
#HYDTPinfo #TrafficAlert
Commuters please note the #Notification in connection with the construction of #HighLevelBridge connecting Moosarambagh on #MusiRiver from Ali Café X road to Pista House. #TrafficRestrictions #TrafficDiversions from 23.12.23 till completion of work. pic.twitter.com/flkmMLaAvT— Hyderabad Traffic Police (@HYDTP) December 23, 2023
Moosarambagh bridge closed partially-Traffic diversion imposed🚦
Traffic diversions are in place due to the construction of a High-Level bridge connecting Moosarambagh on the Musi River from Ali Café X road to Pista House.
All general vehicular traffic, heavy vehicles & RTC… pic.twitter.com/T4cm0Tg9O2
— Sudhakar Udumula (@sudhakarudumula) December 23, 2023
Also Read:
హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఢిల్లీలో లాగా బేసి, సరి రూల్?