Crime News: ప్రియుడి టార్చర్‌.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..!

ప్రియుడి టార్చర్‌ భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌ జీడిమెట్లలోని షాపూర్‌నగర్‌- NLB నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు ఓరుగంటి సాయిగౌడ్‌ వేధింపులు భరించలేక ప్రియురాలు అఖిల తీవ్ర మనస్థాపం చెందింది. పెళ్లి విషయంలోనూ సాయి ముఖం చాటేయడంతో సూసైడ్ చేసుకుంది.

New Update
Crime News: ప్రియుడి టార్చర్‌.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..!

Also Read: దేశంలోనే తొలి సముద్రగర్భ సొరంగం ప్రారంభించిన 2 నెలల్లోనే లీకేజీ!

అయితే, ఈ మధ్య సాయిగౌడ్‌ తీరులో అఖిలకు మార్పు కనిపించింది. ప్రియురాలిని మానసికంగా వేధించేవాడని..కోపంతో రోడ్డుపైనే పలుసార్లు అఖిలను కొట్టినట్లు తెలుస్తోంది. సాయి కొడుతున్నాడని అఖిల అమ్మ, నాన్నలకు చెప్పింది. వేధింపులు భరించలేక తీవ్ర మనస్థాపం చెందింది. అంతేకాకుండా సాయి పెళ్లి విషయంలోనూ ముఖం చాటేయడతో అఖిల భరించలేకపోయింది.

Also Read: బస్సులోనే ప్రసవించిన మహిళ.. తల్లీబిడ్డా క్షేమం!

అఖిల సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. 'అమ్మ.. నాన్న మీరు చెప్పిన మాటల్ని నేను వినలేదు. నా కోసం మీరు అతడిని ఒప్పుకున్నారు. కానీ అతను పెట్టే టార్చర్‌ భరించలేక చనిపోతున్నాను. ఐ లవ్‌ యూ అమ్మ నాన్న అంటూ 'సూసైడ్ చేసుకుంది. అఖిల మృతితో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు విగితా జీవిగా పడి ఉండటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు