IT Employees: చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ హైటెక్‌ సిటీలో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టెకీలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం అని మండిపడ్డారు.

New Update
IT Employees: చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన

IT Employees Protest in Hyderabad Over Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ హైటెక్‌ సిటీలో (Hitech City) ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ (Wipro Circle) వద్ద టెకీలు నల్ల రిబ్బన్లు ధరించి నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం అని మండిపడ్డారు. చంద్రబాబు కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసం ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కీలకమని గుర్తుచేశారు. ఆయన వల్లే ఐటీ అభివృద్ధి చెందిందని.. ఎంతో మంది యువత నేడు ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

జగన్ (jagan) అధికారంలోకి వచ్చాక ఏపీలో అభివృద్ధి శూన్యమైందన్నారు. ఎక్కడా అభివృద్ధి లేదనా.. ఎక్కడిక్కడ అన్యాయం, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని.. కానీ కావాలనే కుట్ర చేసి బాబును జైలుకు పంపారని ఆరోపించారు. తాను అవినీతి పరుడు అయితే మిగతా వాళ్లు కూడా అలాగే ఉంటారని జగన్ భ్రమిస్తున్నారని చెప్పారు.స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎందరికో ఉపాధి లభిస్తుందన్నారు. చాలా మంది దాని ద్వారా సొంత కాళ్ల మీద నిలబడ్డారన్నారు. ఏపీలో అన్ని శాఖలు ఇవాళ జగన్ చేతుల్లో కీలు బొమ్మలుగా మారాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో హైదరాబాద్ ఐటీ ఎగుమతులలో మెరుగైన స్థానానికి చంద్రబాబే కారణమని వెల్లడించారు.

మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీడీపీ నేతలు మానవహారానికి పిలుపునిచ్చారు. ఐయామ్ విత్ CBN కార్యక్రమానికి పోలిసులు అనుమతి నిరాకరించారు. భారీగా ఐటీ ఉద్యోగులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు ఉద్యోగులను చెదరగొట్టరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: వాట్‌నెక్ట్స్‌..? సుప్రీం కోర్టుకు చంద్రబాబు? అక్కడే తేల్చుకునే ఛాన్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు