TS: ఛీ..ఛీ.. వీడేం మనిషి.. చాక్లెట్ ఆశ చూపి 8 ఏళ్ల పాపపై..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. చాక్లెట్ ఆశ చూపి 8ఏళ్ల పాపపై 50ఏళ్ల బోడ నర్సింహ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప కేకలు వేయడంతో వెంటనే పరార్ అయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు నర్సింహను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
TS: ఛీ..ఛీ.. వీడేం మనిషి.. చాక్లెట్ ఆశ చూపి 8 ఏళ్ల పాపపై..

Hyderabad: చిన్నారులపై లైంగిక దాడులు ఏ మాత్రం ఆగడం లేదు. పోక్సో చట్టం ఇలాంటి దారుణాలను ఆరికట్టలేకపోతుంది. తాజాగా, 8 ఏళ్ల పాపపై 50 ఏళ్ల కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరమైన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెత్తుల్లా గ్రామంలో చోటుచేసుకుంది.

Also Read: సంచలనంగా అనకాపల్లి మైనర్‌ బాలిక హత్య కేసు.. 40 గంటలు దాటినా దొరకని నిందితుడి ఆచూకీ.!

బోడ నర్సింహ అనే వ్యక్తి చాక్లెట్ ఆశ చూపి 8 ఏళ్ల పాపపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పాప కేకలు వేయడంతో వెంటనే నర్సింహ పరార్ అయ్యాడు. ఘటనపై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నర్సింహను అరెస్ట్ చేశారు.

Also Read: నందికొట్కూరు టీడీపీలో గ్రూప్ వార్.. అగ్గిరాజేసిన బైరెడ్డి!

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు, నాయీబ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు