Mimicry Artist Shiva Reddy: గణేశ్ నిమజ్జనం వేళ.. RTV స్టూడియోలో శివారెడ్డి సందడే సందడి!

RTV స్టూడియోలో ప్రముఖ కమిడియన్ శివారెడ్డి(Mimicry Artist Shiva Reddy) హంగామా చేశారు. వినాయాక చవితి సందర్భంగా RTV స్టూడియోని ఓపెన్‌ చేసిన ఆయన తన మిమిక్రీతో అందరిని అబ్బురపరిచారు.

New Update
Mimicry Artist Shiva Reddy: గణేశ్ నిమజ్జనం వేళ.. RTV స్టూడియోలో శివారెడ్డి సందడే సందడి!

సినిమాలో బాగా కనిపిస్తూనే, స్టేజ్‌ పై అందరిని ఎంటర్‌టైన్‌ చేయాడమంటే తనకు చాలా పిచ్చి అని చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగానే మిమిక్రి శివారెడ్డి బాలాపూర్‌ లడ్డుపై రిపోర్టింగ్ చేశారు. అలాగే టాలీవుడ్ హీరో మోహన్‌ బాబు వాయిస్ తో సుపర్‌ గా మిమిక్రీ చేస్తూ ఆయన డైలగ్స్‌ చెప్పారు.

టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవిత రాజశేఖర్‌ వాయిస్‌లు ఇమిటేట్ చేస్తూ సందడి చేశారు. వారి లాగే మాట్లాడుతూ నవ్వులు పండించారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రోశయ్య గారిని కూడా ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్ లో వినాయకుడి పండుగను చూస్తే కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. అయితే, శోభయాత్ర సందర్భంగా రద్ది తట్టుకోలేక ఇంట్లోనే కూర్చుంటున్నా అని చెప్పారు. తన చిన్నతనంలో జరిగిన వినాయకడి పండుగకు ఇప్పుడు జరుగుతున్న పండుగకు చాలా తేడా ఉందని చెప్పుకొచ్చారు. కేవలం భక్తి గీతాలతో ఉండే నవరాత్రులు ఇప్పడు డీజేలతో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారన్నారు. గున్న గున్న మామిడి పాటను కాస్తా..గన్న గన్న నాధుడా అంటూ మార్చేస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు వాయిస్‌ భలేగా మిమిక్రీ చేసి చూపించారు. బాలాపూర్‌ లడ్డుపై వీహెచ్‌ ఎలా స్పందిస్తారో ఆదే విధంగా మాట్లాడారు. డబ్బును లెక్క చేయకుండా లడ్డును భక్తులు వేలం పాట పాడడం చాలా మంచిదని వీ హెచ్‌ స్టైల్ లో చెప్పారు. తన మిమిక్రీని చూసి వీ హెచ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతారని ఆయన చెప్పారు. ఇలా తన మిమిక్రీ టాలెంట్ తో RTV స్టూడియోలో హంగామా సృష్టించారు శివరెడ్డి.

Also Read: బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర రూ. 27 లక్షలు

Advertisment
Advertisment
తాజా కథనాలు