Metro : ముందు మెట్రో ఎక్కండి.. దిగాకే టికెట్‌ కొనండి.. హైదరాబాద్‌ మెట్రో ఓపెన్‌ లూప్‌ టికెటింగ్‌!

హైదరాబాద్‌ మెట్రోలో మరో కొత్త టికెటింగ్‌ విధానం అమల్లోకి రాబోతుందా? అంటే అవుననే సమాధానం ఇస్తుంది ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ. ఇతర దేశాల్లో మాదిరిగానే ఓపెన్‌ లూప్ టకెటింగ్‌ వ్యవస్థను మెట్రో అందుబాటులోకి తీసుకురాబోతోంది.

New Update
Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..!

Hyderabad Metro Open Loop Ticketing :హైదరాబాద్‌ మెట్రోలో మరో కొత్త టికెటింగ్‌ విధానం అమల్లోకి రాబోతుందా? అంటే అవుననే సమాధానం ఇస్తుంది ఎల్‌ అండ్‌ టీ (L&T) హైదరాబాద్‌ మెట్రో (Hyderabad Metro) సంస్థ. ఇతర దేశాల్లో మాదిరిగానే ఓపెన్‌ లూప్ టకెటింగ్‌ వ్యవస్థను మెట్రో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ విధానం అమల్లోకి వస్తే ముందే టికెట్ తీసుకోవాల్సిన పని లేదు.

దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేస్తారు. ఈ కొత్త విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరం (Financial Year) లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంలో హైదరాబాద్​ మెట్రోరైలు సంస్థ యోచిస్తుంది. అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ప్రజారవాణాలో టికెట్లు, వాటికి చెల్లింపు పద్ధతులపై ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. కౌంటర్లలో సిబ్బంది విక్రయించే టికెట్లు, టికెట్‌ వెండింగ్‌ యంత్రాల ద్వారా పొందే విధానం, స్మార్ట్‌కార్డ్స్ (Smart Cards), మొబైల్‌ నుంచి వాట్సాప్‌లో టికెట్‌ పొందే వీలు ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్ల వ్యవస్థల ద్వారా వాటిని అనుమతించడం వరకు హైదరాబాద్‌ మెట్రోలో ఇప్పటివరకు చూశాం.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్లోజ్డ్‌ లూప్‌ టికెటింగ్‌ విధానంలో ముందే టికెట్‌ తీసుకోవాలి. దిల్‌సుఖ్‌నగర్‌లో మెట్రో ఎక్కి ఖైరతాబాద్‌ వరకు టికెట్‌ తీసుకుని మనసు మార్చుకుని అమీర్‌పేటలో దిగుతామంటే ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్ల వ్యవస్థ అందుకు అనుమతించదు. స్టేషన్‌ సిబ్బందికి చెబితే అదనంగా ప్రయాణించిన దూరానికి డబ్బులు తీసుకున్న తర్వాత మాత్రమే బయటికి పంపిస్తారు.

గమ్యస్థానానికి ముందే దిగుదామన్నా గేటు తెర్చుకోదు. అందుకోసం స్టేషన్‌ సిబ్బందిని సంప్రదించాల్సిందే. ఓటీఎస్‌ (OTS) తో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణించిన తర్వాత మాత్రమే దూరాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు.

Also read: సూపర్‌ 16 కి చేరిన జార్జియా!

Advertisment
తాజా కథనాలు