Hyderabad: పీఎస్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్‌.. హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదీ..!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్‌ నిర్వహించడంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రకరకాలుగా వార్తలు ప్రసారమైనప్పటికీ.. సీపీ మాత్రం చాలా పాజిటివ్‌గా స్పందించారు.

New Update
Hyderabad: పీఎస్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్‌.. హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదీ..!

Hyderabad CP CV Anand: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్‌ నిర్వహించడంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) స్పందించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రకరకాలుగా వార్తలు ప్రసారమైనప్పటికీ.. సీపీ మాత్రం చాలా పాజిటివ్‌గా స్పందించారు. వాళ్లు అడిగితే నేనే పర్మిషన్ ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సీపీ.. ఈ విధంగా చెప్పుకొచ్చారు.

'పోలీస్ స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్‌పై మిశ్రమ స్పందనలు చూశాను. నిజాయితీగా చెప్పాలంటే.. వారు తమ వివాహం విషయంలో కొంచెం ఎక్కువగా ఎగ్జైట్‌ ఫీల్ అయ్యారు. వాస్తవానికి ఇది గొప్ప శుభవార్త. కానీ, కొంచెం ఇబ్బందిగా మారింది. పోలీసింగ్ అనేది చాలా కఠినమైన పని. ముఖ్యంగా మహిళలకు ఇబ్బందిగా ఉంటుంది. ఆమెకు(మహిళా ఎస్‌ఐకి) డిపార్ట్‌మెంట్‌లోనే జీవిత భాగస్వామి దొరికినందుకు మనందరం సంతోషించాలి. ఈ ఇద్దరు పోలీసు అధికారులు.. డిపార్ట్‌మెంట్ ప్రాపర్టీ, చిహ్నాలను ఉపయోగించడంలో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు. అయితే, వారు మాకు ముందే తెలియజేసి ఉంటే.. మేమే ఖచ్చితంగా షూట్‌కి అనుమతి ఇచ్చేవాళ్లం. మనలో కొందరికి ఆగ్రహావేశాలు కలగవచ్చు. కానీ, అది సరికాదు. వారి పెళ్లికి నన్ను పిలవనప్పటికీ.. వారిని కలుసుకుని ఆశీర్వదించాలని భావిస్తున్నాను. అయితే, ఇలాంటి ఘటనలు పునరావృకాకుండా సిబ్బంది తప్పకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఏదైనా అనుకుంటే.. ముందుగా సంబంధిత అధికారుల నుంచి సమ్మతి తీసుకోవాలని ఇతరులకు నేను సలహా ఇస్తున్నాను' అంటూ చాలా కూల్‌గా రియాక్ట్ అయ్యారు సీపీ.

సీపీ సీవీ ఆనంద్ రియాక్షన్‌కి యావత్ నెటిజన్ లోకం ఫిదా అయిపోయింది. పోలీసులూ మనుషులే అని, వారికీ మనలాగే ఫీలింగ్స్ ఉంటాయనే విషయాన్ని సమాజం గుర్తించాలంటూ హితవు చెబుతున్నారు. మొత్తానికి ఈ జంటపై చర్యలు తీసుకుంటారని కొందరు భావించినా.. సీపీ పెద్ద మనసు, మంచి మనసుతో ఆ జంటను పరోక్షంగా ఆశీర్వదించారు.

కాగా, పంజాగుట్ట పోలీస్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ భావనతో ఏఆర్ ఎస్సై కిషోర్ వివాహం జరిగింది. వీరి వివాహం గత నెల ఆగస్టు 26న జరుగగా.. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. అయితే, ఈ షూటింగ్‌ స్పాటే ఇప్పుడు వివాదాస్పదమైంది. రకరకాల లొకేషన్లలో ప్రీవెడ్డింగ్ షూట్‌ చేసిన ఈ జంట.. మొదటి షాట్‌ మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అది ఖాకీ డ్రెస్ ధరించి, పోలీస్ వాహనం ఉపయోగించారు. దాంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు రచ్చ క్రియేట్ చేస్తోంది. ఇద్దరూ సినిమా రేంజ్‌లో ఖాకీ డ్రెస్‌లో ఫోజులు ఇస్తూ ప్రీవెడ్డింగ్ షూట్‌లో తళుక్కుమన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ సదురు ఎస్సై లు భావన, కిషోర్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రీ వెడ్డింగ్ షూట్‌పై మండిపడుతున్నారు.

Also Read:

Congress: తెలంగాణపై కాంగ్రెస్ హామీల వర్షం.. సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలు ఇవే..

ICC World Cup: క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ వీరే.. సచిన్ ప్లేస్ ఎంతంటే..

Advertisment
తాజా కథనాలు