అమ్మ కి'లేడీ'.. మాజీ ప్రియుడిపై పగతో మైండ్ బ్లాంక్ స్కెచ్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..!

తనను దూరం పెడుతున్నాడనే కోపంతో ప్రియుడిని గంజాయి కేసులో అరెస్ట్ చేయించేందుకు కుట్ర పన్నింది ఓ యువతి. అయితే, పోలీసుల విచారణలో నిజం తెలియడంతో యువతిని, ఆమె స్నేహితులు ఆరుగురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు.

New Update
అమ్మ కి'లేడీ'.. మాజీ ప్రియుడిపై పగతో మైండ్ బ్లాంక్ స్కెచ్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్..!

Hyderabad News: వాళ్లిద్దరూ ఒకప్పటి ప్రేమికులు.. ఇంతలో ఏమైందో ఏమో వారిద్దరూ విడిపోయారు. కానీ, అతను సైలెంట్ అయినా.. ఆమె మాత్రం పగ పెంచుకుంది. అతని జీవితాన్ని నాశనం చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇంకేముంది.. తన మాస్టర్ మైండ్‌తో సినిమాటిక్ స్టైల్‌లో ప్లాన్ చేసింది. ఆ ప్లా్న్‌ను ఇంప్లిమెంట్ కూడా చేసింది. అతని అరెస్ట్‌కు కారణమైంది. కానీ, పోలీసుల విచారణలో అంతకు మించిన మైండ్ బ్లాంక్ ట్విస్ట్ వెలుగు చూసింది. అసలు గుట్టు రట్టయ్యింది. ఇప్పుడీ టాపిక్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైంది. మరి ఇంత సెన్సేషనల్ అయిన ఈ మ్యాటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఓసారి చూద్దాం..

హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌కు చెందిన ఓ యువతి.. తన మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ ప్రయత్నం కాస్తా విఫలమవడంతో.. అడ్డంగా బుక్కయ్యింది. అసలు నిందితురాలు ఆమే అని తేలడంతో.. ఆమెను, ఆమెకు సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. రహమత్‌నగర్‌కు చెందిన యువతి.. అమీర్‌పేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తోంది. సరూర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు కూడా అదే ప్రాంతంలో పని చేసేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న తరువాత.. ఆ యువకుడు యువతిని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో అతనిపై కోపం, పగ పెంచుకుంది యువతి. ఎలాగైనా అతని జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా.. అతన్ని జైలుకు పంపాలని ఫిక్స్ అయ్యింది.

ఈ క్రమంలోనే.. తనకు తెలిసిన కొందరు స్నేహితుల సాయంతో కొంత గంజాయి కొనుగోలు చేసింది. దీనిని ప్యాకెట్లలో పెట్టి.. తన వద్ద దాచుకుంది. తన స్నేహితులతో తన మాజీ ప్రియుడికి ఫోన్ చేయించింది. ఆ తరువాత యువతి, ఆమె స్నేహితులు, ప్రియుడితో కలిసి అతని కారులో జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. ఇదే మంచి ఛాన్స్ అనుకుని వెంటనే తనకు తెలిసిన పోలీస్ కానిస్టేబుల్‌కు ఫోన్ చేసింది. ఒక వ్యక్తి గంజాయి అవిక్రయిస్తున్నాడని, అతని కారులో గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయని సమాచారం అందించింది. దీంతో వెంటనే సదరు పబ్ వద్దకు చేరుకున్న పోలీసులు.. యువతి చెప్పిన కారులో సెర్చ్ చేశారు. అందులో 5 గంజాయి ప్యాకెట్లు లభ్యమవగా.. యువతి మాజీ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.

యువకుడిని విచారించగా.. గంజాయితో తనకేం సంబంధం లేదని, తనకు తెలిసిన వారి కారును తీసుకువచ్చానని తెలిపాడు. దీంతో అతన్ని పక్కకు పెట్టి కారులో వచ్చిన మిగతా వారిని విచారించారు పోలీసులు. మొదట ఎవరూ తమకు తెలియదంటే తమకు తెలియదని బుకాయించారు. కానీ, పోలీసులు వదిపెడతారా? తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజం చెప్పేశారు. యువతి కావాలనే అతనిపై కక్ష పెంచుకుందని, తనను దూరం పెడుతున్న ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు నిర్ధారించారు పోలీసులు. మ్యాటర్ మొత్తం రివీల్ అవడంతో.. పోలీసులు యువతిని, ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, యువతి వేసిన ప్లాన్ తెలిసి మాజీ ప్రియుడు, పోలీసులు అవాక్కయ్యారు.

Also Read:

ఇలా చేస్తే హ్యాంగోవర్ సమస్యే ఉండదు..!

కాకా నువ్ కేక.. ఆయన మీసం పొడవెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు