Mayor: హైదరాబాద్ కలెక్టర్ కు మేయర్ వినతి!

నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఆమె బంజారాహిల్స్ ఎన్ బీటీ నగర్ లో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ కు ఆనుకొని ఉన్న ఓపెన్ ల్యాండ్ లో విద్యార్థుల కోసం అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో ఆ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.

New Update
Mayor: హైదరాబాద్ కలెక్టర్ కు మేయర్ వినతి!

Mayor: నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. ఆమె బంజారాహిల్స్ ఎన్ బీటీ నగర్ లో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ కు ఆనుకొని ఉన్న ఓపెన్ ల్యాండ్ లో విద్యార్థుల కోసం అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆమె మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో ఆ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ..హైస్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలం అన్యాక్రాంతం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దానికి అడ్డుకట్ట వేయడం జరిగిందన్నారు. దీని కోసమే ప్రభుత్వ భూమిలో పాఠశాల ఎక్స్ ట్రా గదుల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాన్ని విద్యాశాఖకు కేటాయించిన తర్వాత అదనపు గదుల నిర్మాణం కోసం రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు రెండు కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించారని ఆమె అన్నారు.

దీంతో అందుకు అంచనాలు తయారు చేయాలని కలెక్టర్ ను ఆమె కోరారు. ఈ సందర్భంగా మేయర్ ఇంకా కలెక్టర్ విద్యార్థుల తరగతి గదులకు వెళ్లి మాట్లాడారు. ఇక స్టూడెంట్స్ మాట్లాడుతూ.. ఖాళీ స్థలంలో ముళ్ల పొదలు ఇంకా పిచ్చి మొక్కలు ఉండడంతో పురుగులు వస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ కలెక్టర్ డీఈఓకు, విద్యాశాఖ మౌలిక సదుపాయాల శాఖ ఇంజనీర్ కు ఆర్డర్స్ జారీ చేశారు. వెంటనే అంచనాలపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు