Hyderabad Brick Biryani: హైదరాబాదీ ఇటుక బిర్యానీ గురించి మీకు తెలుసా? తింటే వావ్ అంటారంతే..

హైదరాబాద్ అంటే టక్కున గుర్తుకొచ్చేది.. ఫస్ట్ చార్మినార్, నెక్ట్స్ ధమ్ బిర్యానీ. ఇక ఈ బిర్యానీని రకరకాలుగా తయారు చేస్తారు చెఫ్‌లు. ఏ విధంగా చేసినా.. దాని టేస్ట్ ముందు మరే వంటకమైనా బలాదూర్ అవ్వాల్సిందే.

Hyderabad Brick Biryani: హైదరాబాదీ ఇటుక బిర్యానీ గురించి మీకు తెలుసా? తింటే వావ్ అంటారంతే..
New Update

Hyderabad Brick Biryani: హైదరాబాద్ అంటే టక్కున గుర్తుకొచ్చేది.. ఫస్ట్ చార్మినార్, నెక్ట్స్ ధమ్ బిర్యానీ(Brick Biryani). ఇక ఈ బిర్యానీని రకరకాలుగా తయారు చేస్తారు చెఫ్‌లు. ఏ విధంగా చేసినా.. దాని టేస్ట్ ముందు మరే వంటకమైనా బలాదూర్ అవ్వాల్సిందే. కుండ బిర్యా్ని, ముంత బిర్యానీ, బొంగులో బిర్యానీ, మండి బిర్యానీ, బకెట్ బిర్యానీ.. ఇలా రకరకాల బిర్యానీలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తింటూనే ఉంటాం. ఇవాళ మీకోసం మరో స్పెషల్ ధమ్ బిర్యానీని తీసుకువచ్చాం. ఆ బిర్యానీ తింటే ఫిదా అయిపోతారంతే. అదే ఇటుక బిర్యానీ. ఇదేందయా ఇదీ.. మేమెప్పుడూ చూడలేదు, వినలేదు అంటారా? అందుకే.. మీ ముందుకు తీసుకువచ్చాం.

ఇప్పుడు హైదరాబాద్‌లో(Hyderabad) బాగా వినిపిస్తున్న బిర్యానీ ఇటుక బిర్యానీ. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు కొంపల్లిలో 'బ్రిక్ బిర్యానీ' అనే రెస్టారెంట్‌ను పరిచయం చేశారు. వారి రెస్టారెంట్‌లో వినూత్నంగా బిర్యానీలను ఇటుకలతో తయారు చేసి, వడ్డిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ కంటైనర్‌లలోనే బిర్యానీని తయారు చేస్తున్నారు.

ఇవి నిర్మాణం కోసం ఉపయోగించే ఎర్ర ఇటుకల మాదిరిగానే ఉంటాయి. కానీ వాటిలో బిర్యానీలు, ఇతర వంటకాలను వండుతున్నారు ఈ సోదర ద్వయం. పూర్తి స్థాయి ఇటుకలుగా కాకుండా.. ఒక గిన్న మాదిరిగా ఈ ఇటులకను తయారు చేయించారు. వీటికి లోపలి వైపు నెయ్యిని అప్లై చేసి, ఆ తరువాత పాక్షికంగా ఉడికి అన్నం, చికెట్, మసాలాలు వేసి, కుండ బిర్యానీ మాదిరిగా వంట చేస్తున్నారు. ఇక ఇటుక పై కప్పుడు గోధమ పిండితో మూసివేసి, ఒవెన్‌లో కుక్ చేస్తారు. ఈ ఇటుకల కోసమే ప్రత్యేకంగా పొయ్యిని సిద్ధం చేశారు నిర్వాహకులు. ఈ బిర్యానీని 260 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వండుతారు. ప్రతి ఇటుక బిర్యానీని మధ్యలో చెక్ చేస్తుంటారు.

ఈ రెస్టారెంట్ నిర్వాహకులు.. కాల్చిన ఇటుక చికెన్ ధమ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, ఎగ్ బిర్యానీతో పాటు.. పెరుగు అన్నం, సాంబార్ రైస్, ఇతర ఆహారాలు కూడా సప్లయ్ చేస్తున్నారు. ఈ బిర్యానీ ప్రత్యేకమైంది మాత్రమే కాదండోయ్. దీని ధర కూడా చాలా తక్కువే. చికెన్ బిర్యానీ ధర రూ. 150, వెజిటబుల్ బిర్యానీ రూ. 120, సాంబార్ రైస్ రూ. 130 ఇలా ఇతర వంటకాల ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయి.

Also Read:

Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి.. ఇది ఎక్కడుందో తెలుసా?

CM KCR: గురుకుల కాంట్రాక్ట్ టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌ న్యూస్.. వారందరినీ క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe