Kompella Madhavi Latha: మసీద్‌పై బాణం ఎక్కుపెట్టిన వీడియో.. క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత

TG: మసీద్‌పై తాను బాణం ఎక్కుపెట్టినట్లు వైరల్ అవుతోన్న వీడియోపై స్పందించారు మాధవి లత. తనపై బురదజల్లేందుకే కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అది పూర్తి వీడియో కాదని అన్నారు. దీని వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలని కోరారు.

New Update
Kompella Madhavi Latha: మసీద్‌పై బాణం ఎక్కుపెట్టిన వీడియో.. క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత

BJP MP Candidate Kompella Madhavi Latha: గత రెండు రోజులుగా మసీద్‌పై తాను బాణం ఎక్కు పెట్టినట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై స్పందించారు హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత. తనపై బురదజల్లేందుకే కొందరు కావాలని తప్పుడు వీడియో ప్రచారం చేస్తున్నారని.. అది పూర్తి వీడియో కాదని మాధవి లత క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతింటే వారిని తనను క్షమించాలని కోరుతున్నానని.. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోనని అన్నారు. తనకు అందరు సమానమే అని పేర్కొన్నారు. ఎవరైనా ఆ తప్పుడు వీడియో వల్ల బాధపడి ఉంటే సారీ అని అన్నారు. ఇది కేవలం తనను రాజకీయంగా ఎదురుకోలేక చేస్తున్న తప్పుడు ప్రచారం అని ఆమె ఫైర్ అయ్యారు. కాగా ఇదే అంశంపై అసదుద్దీన్‌ ఓవైసీ సీరియస్ అయ్యారు. ఆమె తీరు ఈసీ,పోలీసులకి కనిపించదా అంటూ ఫైర్ అయ్యారు.

వివాదం మొత్తం వీడియో తోనే...

శ్రీరామనవమిని రోజుమా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఓల్డ్ సిటీలో రామనవమి శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. లోక్ సభ ఎన్నికల వేళ ఈ వీడియో ఇప్పుడు ఇది పొలిటికల్ హీట్ ను పెంచింది. ముస్లిం ల మనోభావాలు దెబ్బ తీసేందుకే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శలు వచ్చాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ వీడియో పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు