హైదరాబాద్‌లో మరోసారి జీరో షాడో డే.. రేపు ఆ టైమ్‌లో నీడ కనపడదు బాసూ..!

భాగ్యనగర వాసులను మరోసారి 'జీరో షాడో డే' కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 12:23 గంటల నిమిషాలకు మరోసారి నీడ కనపడదు. ఈ ఏడాది మే9న కూడా ఇలానే జరిగింది. ఏడాదికి రెండు సార్లు ఇలా జరుగుతుంది. సూర్యుడు నేరుగా భూ మధ్యరేఖకు ఎగువన అలైన్‌మెంట్‌లో ఉంటాడు. అందుకే నీడ కనపడదు.

హైదరాబాద్‌లో మరోసారి జీరో షాడో డే.. రేపు ఆ టైమ్‌లో నీడ కనపడదు బాసూ..!
New Update

హైదరాబాద్‌(hyderabad) వాసులకు అలెర్ట్.. మరోసారి అద్భుతాన్ని కళ్లరా చూసేందుకు రెడీ అవ్వండి. మే9 న పొందిన ఆ థ్రిల్‌ మరోసారి మిమ్మల్ని పలకరించనుంది. రేపే (ఆగస్టు 3) జీరో షాడో డే. రేపు మధ్యాహ్నం 12:23 గంటలకు నీడ కనపడదు. ఈ ఏడాది మే9 న మధ్యాహ్నం 12:12 నుంచి 12:14 గంటల మధ్య ఈ అరుదైన ఘటన ఆవిష్కృతం అవ్వగా రేపు కూడా అదే దృశ్యం మరోసారి భాగ్యనగర వాసులకు కనువిందు చేయనుంది. ఇలాంటి అరుదైన ఘటనను కళ్లరా వీక్షించేందుకు అంతా సిద్ధమవుతున్నారు. నగరవాసులు తప్పకుండా అనుభూతి చెందాల్సిందేనని అటు సైంటిస్టులు కూడా చెబుతున్నారు..!

జీరో షాడో డే అంటే?
జీరో షాడో అనేది సూర్యుడు సరిగ్గా తలపైకి వచ్చినప్పుడు.. సంవత్సరానికి రెండుసార్లు భూ మధ్యరేఖకు సమీపంలోని ప్రాంతాలలోనే సంభవిస్తుంది. ట్రాపిక్‌ ఆఫ్ క్యాప్రికార్న్.. ట్రాపిక్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ మధ్య ఇది జరుగుతుంది. సూర్యుడు నేరుగా భూ మధ్యరేఖకు ఎగువన అలైన్‌మెంట్‌లో ఉంటాడు. అందుకే నీడ కనపడదు. దీన్ని ఎక్స్‌పిరియన్స్‌ చేయడానికి.. సూర్యుడు నేరుగా తలపై ఉండే బహిరంగ ప్రదేశంలో ఉండాలి. దీని అర్థం ఎత్తైన భవనాలు లేదా చెట్ల లాంటి నీడను కలిగించే అడ్డంకులు ఉండకూడదు.

గెట్ రెడీ:
నిజానికి భూమి కొన్నిసార్లు ఉత్తరముఖంగా.. కొన్నిసార్లు దక్షిణముఖంగా ప్రయాణిస్తుంది. భూమి గోళాకారంలో ఉంటుంది. అందుకే సూర్యకిరణాలు మధ్యాహ్నం వేళ భూ మధ్య రేఖపై మాత్రమే పడుతాయి. ఉత్తరాన, దక్షిణాన నేరుగా పడవు. ఇక గత మేలో సంభవించిన 'జీరో షాడో డే'ను హైదరాబాద్‌లో చాలా మంది వీక్షించారు. ముఖ్యంగా స్కూల్‌ పిల్లలు ఈ అనుభూతిని పొందేందుకు ఎంతో ఆసక్తిని చూపించారు. స్కూల్ యాజమాన్యాలు కూడా విద్యార్థుల కోసం స్పెషల్‌ ప్రొగ్రామ్‌లను నిర్వహించింది. షాడో కనిపించని టైమ్‌కి విద్యార్థులను స్కూల్‌ గ్రౌండ్‌లోకి తీసుకొచ్చి.. ఓ సర్కిల్‌లో నిలబెట్టి నీడ కనపడని దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపించింది. అటు మీడియా కూడా దీనిపై ఎక్కువగా ఫోకస్‌ చేసింది. పలువురు సైంటిస్టులతో ఈ పరిణామాలపై మాట్లాడించింది. ప్రజలకు అర్థమయ్యేలా వివరించింది.

ఇక రేపు కూడా జీరో షాడోను అనుభవించేందుకు నగరం సిద్ధమైంది. మే9న వీక్షించలేకపోయిన వారు రేపు ఎలాగైనా ఈ దృశ్యాన్ని చూడాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే కొన్ని గ్రౌండ్స్‌ని ఎంపిక చేసుకున్నారు. చుట్టూ ఎత్తైన ఇళ్లు, చెట్లు లేని చోట 'జీరో షాడో' ఎఫెక్ట్ క్లియర్‌గా కనిపిస్తుంది. అటు BM బిర్లా ప్లానిటోరియం కూడా ఈ ఘటనను చూసేందుకు అనువైన ప్రదేశం.

#zero-shadow-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe