Extramarital affair with Volunteer: ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు మరింతగా పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా అందుకోసం చంపేందుకు కూడా వెనకాడడం లేదు. కడప జిల్లాలో ఇలాంటి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు స్కేచ్ వేసింది. అయితే, భార్య పథకాన్ని పసిగట్టిన భర్త శివశంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివాహేతర సంబంధం భర్త ప్రాణం తీసింది. ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె సచివాలయంలో మహిళా సంరక్షణ అధికారిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య ప్రేమలీల వాలంటీర్ పబ్బతి శ్రీనుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, ఈ విషయం తెలుసుకున్న భర్త శివ శంకర్ రెడ్డి భార్య ప్రేమలీలను గట్టిగా మందలించాడు. దీంతో తన వివాహేతర సంబంధంకు భర్త శివ శంకర్ రెడ్డి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
Also Read: వీటి గురించి మీ లవర్ దగ్గర అసలు మాట్లాడొద్దు.. లేనిపోని గొడవలు తప్పవు!
అయితే, భార్య ప్లాన్‌ని ముందే పసిగట్టాడు భర్త శివశంకర్ రెడ్డి. తన చావుకు కారణం ఏంటో సూసైడ్ నోట్ రాసాడు. ఆనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రేమలీల భర్త శివశంకర్‌రెడ్డి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్ధలంకు చేరుకుని పరిశీలించారు. దీంతో అసలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దసరా రోజు ప్రేమలీల భర్త శివశంకర్‌రెడ్డిని ప్రియుడు పబ్బతి శ్రీను, స్నేహితుడు రాజా బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో భయంతోనే భర్త శివశంకర్‌రెడ్డి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ లీల, పబ్బతి, శ్రీను, రాజాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై స్ధానికులు పలు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళా సంరక్షణ అధికారిగా ఉన్న భార్య ప్రేమలీల బాధ్యతగా ఉండాల్సింది పోయి.. వాలంటీర్ పబ్బతి శ్రీనుతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై దుమ్మెత్తిపొస్తున్నారు. ప్రజల సంరక్షణ కోసం వీరిని నియమిస్తే ఇలా వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త ప్రాణాలు తీసుకునేలా చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.