Crime News: ఏలూరు జిల్లా శ్రీనివాసపురంలో దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త..!

ఏలూరు జిల్లా శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి క్రూరంగా కత్తితో నరికి చంపాడు ఓ భర్త. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం భర్త పరారు అయినట్లు సమాచారం.

New Update
Vizag: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

Husband Killed His Wife: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను కత్తితో నరికి చంపాడు ఓ భర్త. స్ధానికుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన బొబ్బర వంశీకు గత 19 ఏళ్ళ క్రితం ఝాన్సీ అనే మహిళతో వివాహం జరిగింది. శ్రీనివాసపురంలో నివాసం ఉంటున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. గత రెండేళ్ల నుంచి ఝాన్సీ పేరు మీద ఉన్న ఇంటిని విక్రయించాలని భర్త వంశీ ఒత్తిడి చేస్తున్నాడని తెలుస్తోంది.

Also Read:  రాష్ట్రం అప్పుడే బాగుపడుతుంది.. శ్రీ భరత్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ రోజు పిల్లలిద్దరినీ బయటకు పంపి ఇంట్లో భార్యభర్తలు ఘర్షణ పడ్డారని.. గొడవ జరుగుతోన్న క్రమంలో పదునైన ఆయుధంతో భార్య ఝాన్సీ మెడపై భర్త వంశీ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే ఝాన్సీ కుప్పకూలిపోయింది. హత్య అనంతరం తలుపులకు గడియ పెట్టి భర్త పరారైయ్యారని సమాచారం. పిల్లలు తలుపు తీసి చూడటంతో ఝాన్సీ రక్తపుమడుగులో పడి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు