Doctor Radha Murder Case: పక్కా ప్లాన్ తో భార్యను హత్య చేసిన డాక్టర్.. ఆస్తి వివాదాలే కారణం!

గత మూడు నెలలుగా భార్య రాధను చంపేందుకు మహేశ్వర్ రావు స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే గత నెల 25న సాయంత్రం ఆస్పత్రి భవనం రెండో ఫ్లోర్ లో ఒంటరిగా ఉన్న రాధ దగ్గరకు లోక్ నాథ్, డ్రైవర్ మధు వెళ్లారు. మధు ఆమెను పట్టుకోగా.. భర్త రెంచ్ సహాయంతో తలపై దాడి చేశాడు. దీంతో డాక్టర్ రాధ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం పోలీసులకు ఆధారలు దొరక్కుండా.. అక్కడ కారం పొడి చల్లారు. ఆ తర్వాత ఏమాత్రం డౌట్ రాకుండా దొంగతనం జరిగినట్టు భార్య నగలు, డబ్బు ఎత్తుకెళ్లినట్టు చిత్రీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేయగా.. భర్తపై అనుమానం వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బటయ పెట్టాడు. దీంతో డాక్టర్ మహేశ్వర్ రావును, డైవర్, అటెండర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

New Update
Doctor Radha Murder Case: పక్కా ప్లాన్ తో భార్యను హత్య చేసిన డాక్టర్.. ఆస్తి వివాదాలే కారణం!

Doctor Radha Murder Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నంలో డాక్టర్ రాధ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ కేసులో సంచలనమైన విషయాలను బయటపెట్టారు పోలీసులు. డాక్టర్ రాధ హత్య కేసులో భర్తే ఈ దారుణానికి తెగించాడు. మచిలీ పట్టణానికి చెందిన లోకనాథ మహేశ్వర్ రావు, రాధ దంపతులు.. జవ్వారుపేటలోని సొంత ఆస్పత్రిలో 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. గత నెల 25వ తేదీన రాత్రి రాధను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ భర్త మహేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. భర్తే హత్య చేయించినట్టు వెల్లడైంది. రాధ హత్యక పాల్పడిన డ్రైవర్, అటెండర్, భర్త మహేశ్వర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి వివాదాల కారణంగానే భార్యను హత మార్చినట్లు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. గత మూడు నెలలుగా భార్య రాధను చంపేందుకు మహేశ్వర్ రావు స్కెచ్ వేశాడు. ఈ క్రమంలోనే గత నెల 25న సాయంత్రం ఆస్పత్రి భవనం రెండో ఫ్లోర్ లో ఒంటరిగా ఉన్న రాధ దగ్గరకు లోక్ నాథ్, డ్రైవర్ మధు వెళ్లారు. మధు ఆమెను పట్టుకోగా.. భర్త రెంచ్ సహాయంతో తలపై దాడి చేశాడు. దీంతో డాక్టర్ రాధ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం పోలీసులకు ఆధారలు దొరక్కుండా.. అక్కడ కారం పొడి చల్లారు. ఆ తర్వాత ఏమాత్రం డౌట్ రాకుండా దొంగతనం జరిగినట్టు భార్య నగలు, డబ్బు ఎత్తుకెళ్లినట్టు చిత్రీకరించారు.

అలాగే భార్య చనిపోయిందన్న బాధ భర్త మహేశ్వర్ రావులో ఏమాత్రం కనిపించడకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంటికి వచ్చిన బంధువులతో మృతదేహం పక్కనే కుర్చీలో కూర్చుని హుషారుగా మాట్లాడటం, వారికి ఫుడ్ ఆర్డర్ పెట్టడం వంటివి చేశాడు. హత్య జరిగిన మరుసటి రోజే రోగులను చూడడంతో పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. ఇక ఇంటి మెయిన్ డోర్ తలుపు గొళ్లె పెట్టి ఉంటే.. వంటగది నుంచి నిందితులు పారిపోయారని చెప్పడంతో మరిన్ని అనుమానాలు ఎక్కువయ్యాయి పోలీసులు.

ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించాడు. డ్రైవర్‌ మధు బైక్ ‌పై వెళ్లడం, షాపులో కారం కొనుగోలు చేయడం, బిల్లు తీసుకోవడం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. డాక్టర్‌ పై అనుమానం పెరిగి డాక్టర్ ‌ను, డైవ్రర్ ‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయాలు బయటకు కక్కారు. ఇక డ్రైవర్ కు రూ.30 లక్షల డబ్బు, రాధ దగ్గర ఉన్న బంగారం మొత్తం ఇస్తానని, లైఫ్ లో సెటిల్ చేస్తానని డాక్టర్ చెప్పారని డ్రైవర్ చెప్పాడు. ఆస్తుల విషయంలో తేడాలు రావడంతోనే డాక్టర్ రాధను హతమార్చినట్లు నిందితులు చెబుతున్నారు. దీంతో వీరిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారు పోలీసులు.

Also Read: డ్యాన్ చేస్తూ కుప్పకూలిన చిన్నారి..గుండు ప్రదీప్తి గుండెలో చిన్నప్పట్నుంచే రంధ్రముంది..!

Advertisment
Advertisment
తాజా కథనాలు