Tree Viral Video: వైరల్‌గా మారిన వందేళ్ల చెట్టు...అందానికి నెటిజన్ల ఫిదా

వృక్షాలు మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కొన్ని వృక్షాలు చిన్నపాటి గాలివానకే పడిపోతే కొన్ని చెట్లు పురాతనకాలం నుంచి అలాగే ఉంటాయి. 800 ఏళ్ల నుంచి దక్షిణ కొరియాలోని ఓ చెట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చెట్టును ప్రపంచంలోనే ఎంతో అందమైన చెట్టుగా చెబుతున్నారు.

Tree Viral Video: వైరల్‌గా మారిన వందేళ్ల చెట్టు...అందానికి నెటిజన్ల ఫిదా
New Update

Tree Viral Video: వృక్షాలు మానవ మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కొన్ని వృక్షాలు చిన్నపాటి గాలివానకే పడిపోతే కొన్ని చెట్లు పురాతనకాలం నుంచి అలాగే ఉంటాయి. 200 ఏళ్లుగా లేదా 150 ఏళ్ల పాటు కొన్ని చెట్లు బతికి ఉంటాయి. అయితే ఓ చెట్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఏకంగా 800 ఏళ్ల నాటి చెట్టు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడ ఉందంటే..ఈ పురాతమైన చెట్టు దక్షిణ కొరియా దేశంలో ఉంది. దీనిపై ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. దాదాపు 800 ఏళ్ల నుంచి ఈ చెట్టు ఉన్నట్టు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మహిళలకు వరం.. తామర పువ్వుల రసం..ఎన్నో సమస్యలకు చెక్

అంతేకాకుండా దీన్ని దక్షిణ కొరియా జాతీయ స్మారకంగా కూడా పిలుస్తున్నారు. దక్షిణ కొరియాలో ఎక్కువ మంది సందర్శకులు వచ్చే ప్రాంతం ఇది. ఈ చెట్టు సుమారుగా 17 మీటర్ల వరకు చుట్టుకొలత కలిగి ఉంటుంది. విశాలమైన కొమ్మలు ఉంటాయి. మరో విశేషం ఏంటంటే ఈ వృక్షం బంగారం రంగులో మెరుస్తూ ఉంటుంది. అందుకే దీన్ని కొందరు దేవతా వృక్షం అని కూడా అంటుంటారు. నెటిజన్లు ఈ చెట్టును ప్రపంచంలోనే ఎంతో అందమైన చెట్టుగా చెబుతున్నారు. ఈ చెట్టు క్రీస్తూ పూర్వం సిల్లా రాజవంశీయుల హయాంలో మొలకెత్తిందని అధికారులు అంటున్నారు. అయితే పురాణాల ప్రకారం సిల్లా చివరి రాజు సన్యాసిగా మారడానికి కుమ్‌గాంగ్‌ పర్వాతానికి వెళ్తుండగా అందుకు గుర్తుగా మొక్కని నాటాడని అంటున్నారు.

కాకపోతే దానికి తగిన ఆధారాలు కూడా లేవు. సైంటిస్టులు మాత్రం ఈ చెట్టు వెయ్యి ఏళ్ల క్రితందని అంటున్నారు. ఇది జోసోన్‌ రాజవంశ కాలంలోనే ఆ ప్రభుత్వం గుర్తించి సమున్నత ఇచ్చిందని అధికారులు అంటున్నారు. మరోవైపు ఈ చెట్టుని జింకో అని కూడా అంటారు. శాస్త్రవేత్తలకు ఈ చెట్టు ఇన్ని సంవత్సరాలు పెరుగుతూ ఉండటం ఒక పెద్ద మిస్టరీలా మారింది. ఇంకా ఈ చెట్టుపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. జింకో తూర్పు ఆసియాలోని జిమ్నోస్పెర్మ్ జాతికి చెందినదిగా గుర్తించారు. ఈ చెట్టు 290 మిలియన్ ఏళ్ల క్రితం మొదటిసారిగా కనిపించిన మరియు చిట్టచివరి జీవజాతి అంటున్నారు.

Also Read: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు.. కొత్త సీఎం యాక్షన్ ఏంటి?

WATCH:

#tree-viral-video #800-year-old-tree
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe