భారీగా తగ్గిన ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు!

లోక్‌సభ ఎన్నికల చివరి దశ రోజున ఎల్‌పీజీ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ లభించింది. సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా మూడోసారి తగ్గించాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను 72 రూపాయలు తగ్గించాయి

New Update
భారీగా తగ్గిన ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు!

జూన్ 1నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను 72 రూపాయలు తగ్గించాయి. కానీ కంపెనీలు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచాయి.కొత్త రేటు జూన్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ(delhi)లో వాణిజ్య సిలిండర్ ధర రూ.69.50 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో రూ.1676కే 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ లభించనుంది. ఇక హైదరాబాద్‌(hyderabad)లో 19 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.19 తగ్గి రూ.1975.50కి చేరుకుంది. మరోవైపు కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ.72 తగ్గి రూ.1787కే సిలిండర్ లభ్యం కానుంది. ముంబైలో సిలిండర్ రూ. 69.50 తగ్గింపుతో రూ.1629కి అందుబాటులో ఉంటుంది. చెన్నైలో సిలిండర్ ధర రూ.1840.50కి చేరింది. చండీగఢ్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రూ.1697కి అందుబాటులో ఉంది. పాట్నాలో దీని కొత్త ధర రూ. 1932గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రూ.2050కి లభ్యం కానుంది.

మే 1న చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.19 తగ్గించాయి. మే నెలలో సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1745.50, కోల్‌కతాలో రూ.1859, ముంబైలో రూ.1698.50, చెన్నైలో రూ.1911గా ఉండేది. ఏప్రిల్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.30కి పైగా తగ్గింది. ఈ కోత తర్వాత ఢిల్లీలో దీని ధర రూ. 1764.50 అయింది. ఏప్రిల్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కోల్‌కతాలో రూ.1879, ముంబైలో రూ.1717.50, చెన్నైలో రూ.1930లకు చేరింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు