Jobs : సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసేయండి! సింగరేణిలో ఉన్న పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సింగరేణిలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 20 Mar 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Singareni : తెలంగాణలో(Telangana) ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీల(Job Vacancies) ను భర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్లను విడుదల(Notification Released) చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సింగరేణి(Singareni) లో ఉన్న పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సింగరేణిలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. మొత్తం ఖాళీ పోస్టులు.. 327 ఇందులో ఎగ్జిక్యూటివ్ కేడర్... మేనేజ్‌మెంట్ ట్రైనీ(ఈఎం) , ఈ2 గ్రేడ్ -42 పోస్టులు, మేనేజ్ ట్రైనీ (సిస్టమ్స్) ఈ 2 గ్రేడ్ -7. నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ ...జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ (జేఎంఈటీ), టీ-ఎస్ గ్రేడ్ సీ - 100, అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ట్రైనీ (మెకానికల్) టీ-ఎస్ గ్రేడ్ సీ -9, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)టీ-ఎస్ గ్రేడ్ సీ-24, ఫిట్టర్ ట్రైనీ క్యాట్ 1-47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, క్యాట్ 1-98 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ పోస్టులకు అర్హతలు.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే వారు డిగ్రీ పీజీ, ఐఐటీ, డిప్లొమా లో ఉత్తీర్ణులై ఉండాలి. పోస్ట్‌ను బట్టి జూన్ 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎలా ఎంపిక చేస్తారంటే... రాత పరీక్ష(Written Test).. మెరిట్ ఆధారంగా, టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్ టెస్ట్ పెడతారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ, చివరి తేదీలు : ఏప్రిల్ 15.2024 నుంచి మే 04..2024 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. వెబ్‌సైట్: https://scclmines.com/.. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్ సైట్ ను పరిశీలించండి. Also Read : నేడు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు! #job-notification #singareni-jobs #job-vacancies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి