Bhadrachalam: భద్రాచలంలో మళ్లీ పెరిగిన వరద.. 2వ ప్రమాద హెచ్చరిక జారీ..! భద్రాచలం దగ్గర మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు తిరిగి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి 51 అడుగుల దగ్గర ప్రవహిస్తోంది. 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. By Jyoshna Sappogula 27 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bhadrachalam: భద్రాచలం దగ్గర మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు తిరిగి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 51 అడుగుల దగ్గర గోదావరి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. వారం రోజుల్లో మూడుసార్లు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం నుండి నేటి వరకు గోదావరి దోబూచులాడుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 51 అడుగులు దాటడంతో నేషనల్ హైవే-30పై విజయవాడ టు జగదల్‌పూర్ రోడ్డులో రాయణపేట దగ్గర, నేషనల్ హైవే 163పై భద్రాచలం -భూపాలపట్నం రోడ్డుపై కన్నాయిగూడెం దగ్గర వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. #bhadrachalam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి