Spain: వాలెన్సీయాలో భారీ అగ్నిప్రమాదం.. 24మంది మృతి!

స్పెయిన్‌లో వాలెన్సీయాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 14 అంతస్థుల భవనంలో చెలరేగిన మంటలు మరో అపార్ట్ మెంట్ కు అంటుకోవడంతో 24 మంది చనిపోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మంది ఆచూకీకోసం వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Spain: వాలెన్సీయాలో భారీ అగ్నిప్రమాదం.. 24మంది మృతి!
New Update

Fire Incident: స్పెయిన్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Valencia Fire Incident) జరిగింది. వాలెన్సీయా నగరంలోని 14 అంతస్థుల భవనంలో చెలరేగిన మంటలు పక్కనున్న మరో అపార్ట్‌మెంట్ కు అంటుకున్నాయి. దీంతో మంటల్లో చిక్కుకుపోయిన వారిలో 24 మంది మృతి చెందగా.. 13 మందికి గాయాలైనట్లు స్థానికి మీడియా తెలిపింది. మంటల్లో చిక్కుకున్న వారిలో అగ్నిమాపక సిబ్బందితోపాటు మైనర్లు కూడా ఉన్నారని, మరో 15 మంది ఆచూకీకోసం వెతుకుతున్నట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు.

&

బాల్కనీల్లో నరకయాతన..
ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది క్రేన్ల సాయంతో పలువురిని రక్షించారు. మొదట ఓ భవనంలో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో దానికి వ్యాపించాయని, భవన నిర్మాణంలో వాడిన సామగ్రి కారణంగా మంటలు వేగంగా విస్తరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నరకయాతన నుంచి తప్పించుకోవడానికి కొంతమంది నివాసితులు తమ బాల్కనీల నుంచి దూకేశారని, మరికొంతమంది నివాసితులు వారి బాల్కనీలలో చిక్కుకుని ఉన్నట్లు చెబుతూ ఇందుకు సబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Kerala: బాలికపై 80 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు!

ఘటనా స్థలంలో ఫీల్డ్ ఆసుపత్రి..
స్పెయిన్‌ ప్రధాని పెడ్రో షాంచేజ్‌ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 22 ఫైర్ ఇంజన్లు, ఐదు అంబులెన్స్‌లతో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు, ఘటనా స్థలంలో ఫీల్డ్ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేసినట్లు స్థానిక మీడియా నివేదించింది. 'దయచేసి అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి దూరంగా ఉండండి. అత్యవసర సేవలు అందించే వారి పనిని వేగంగా చేయనివ్వండి' అని వాలెన్సియా మేయర్ మరియా జోస్ కాటాలా సోషల్ మీడియా వేదికగా స్థానికులకు రిక్వెస్ట్ చేశారు.

#huge-fire #valencia-spain #24-people-died
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe