Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భారీ తగ్గింపు....వీటిపై 40 నుంచి 75శాతం డిస్కౌంట్..!!

ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అయిన అమెజాన్ ఇండియాలో ప్రైమ్ డే సేల్ ను ప్రారంభించింది. జులై 15నుంచి జులై 16వరకు ఈ సేల్ జరగనుంది. ఈ సారి 48గంటల సేల్ మాత్రమే ఏర్పాటు చేసింది అమెజాన్. ఈ సేల్ లో భాగంగా ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమై ఆఫర్లతోపాటు ఎంపిక చేసిన వస్తువుల షాపింగ్ పై 40 నుంచి 75శాతం వరకు డిస్కౌంట ప్రకటించింది అమెజాన్.

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భారీ తగ్గింపు....వీటిపై 40 నుంచి 75శాతం డిస్కౌంట్..!!
New Update

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ తన కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్ తో ముందుకు వచ్చింది. ఈ సేల్ జూలై 15 నుంచి జులై 16వరకు జరగనుంది. ఇందులో ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన ఆఫర్లు, ఎంపిక చేసిన వస్తువుల షాపింగ్ పై బంపర్ డిస్కౌంట్లు లభించనున్నాయి. అయితే ఈ సారి ఈ సేల్ 48గంటలు మాత్రమే ఏర్పాటు చేసింది. ఈ సేల్లో మీరు ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, వాచ్ లతోపాటు మొదలైన ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా అనేకు ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది. స్మార్ట్ టీవీ, గృహోపకరణాలపై 40 శాతం నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.

publive-image

మీరు ల్యాప్ టాప్ కొనాలనుకుంటే..ఈ సేల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ లు, ఎక్స్చేంజ్ ఆఫర్లతోపాటు మీరు అమెజాన్ లో షాపింగ్ చేస్తున్నప్పుడు యాపిల్, హెచ్పి, ఆసుస్, ఎసర్, లెనోవోల వంటి టాప్ బ్రాండ్ కంపెనీల ల్యాప్ టాప్ లపై మరింత డిస్కౌంట్ ను పొందవచ్చు.

ల్యాప్ టాప్ తోపాటు ఈ సేల్ లో అనేక స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. Realme Norzo N53, Nord CE 3 Lite 5G, OnePlus 11R 5G, Redmi, IQ వంటి స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక భారత్ ఐఫోన్ 14 128జీబీ వేరియంట్ ను రూ.79,900. కు విడుదల చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కేవలం రూ.66,499కే లభిస్తోంది. అంతేకాదు ఎస్బిఐ బ్యాంక్ కార్ట్, ఐసీఐసీఐ డెబిట్, క్రెడి కార్డు ద్వారా ఈ ఐఫోన్ కొనుగోలు చేసినట్లయితే అదనంగా 10శాతం తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్‌ప్లేలు, ఫైర్ టీవీ ఉత్పత్తులపై 55 శాతం వరకు తగ్గింపు ఉంటుందని అమెజాన్ వెల్లడించింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe