గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు సీజ్ చేసిన పోలీసులు నెల్లూరు జిల్లా గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. గూడూరు పరిసర ప్రాంతాలలో అనధికారికంగా వివిధ వాహనాల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల 12 లక్షల 91 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. By Naren Kumar 01 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Cash seized in Gudur: ఏపీలో ఎన్నికల సందడి మొదలైనట్టే కనిపిస్తోంది. కొన్ని నెలల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయనగా.. నెల్లూరు జిల్లా గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. గూడూరు పరిసర ప్రాంతాలలో అనధికారికంగా వివిధ వాహనాల్లో తరలిస్తున్న రూ. 5 కోట్ల 12 లక్షల 91 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇది కూడా చదవండి: వీటిని జాతీయ రహాదారులుగా గుర్తించండి.. గడ్కరికి కోమటి రెడ్డి వినతి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మద్యం, నగదు అక్రమంగా తరలించే అవకాశం ఉండడంతో టోల్‌ప్లాజాలు, శివారు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిపెట్టి పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నెల్లూరు నుంచి చెన్నైకి కొందరు వ్యక్తులు ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 5.12 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో నగదును సీజ్ చేసిన పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిల్లకూరు జాతీయ రహదారితో పాటు గూడూరు పట్టణం, గూడూరు రూరల్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా : గూడూరు పరిధిలో భారీగా నగదు పట్టివేత ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న *5 కోట్ల 12 లక్షలు రూపాయల నగదు పట్టివేత* ఎన్నికల నేపథంలో గూడూరు వ్యాప్తంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో మూడు బృందాలను పట్టుకున్న పోలీసులు… pic.twitter.com/tdcqQgTdVY — APవార్తలు.COM (@apvarthalu) February 1, 2024 #currency-seized-in-gudur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి