పస్ట్ డే ఆదిపురుష్ కలెక్షన్స్
పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ రాఘవుడిగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ఇందులో కృతిసనన్, దేవదత్త నాగే, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 16న భారత్‌తో సహా ఓవర్సీస్లోనూ రిలీజైంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 స్క్రీన్లలో రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ల పరంగానూ దూసుకెళ్తోంది. ఇక తొలి రోజు సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లను రాబట్టి మంచి మార్క్‌ను అందుకుందని ట్రేడ్ వర్గాల టాక్.
రికార్డులను బ్రేక్ చేయనున్న ఆదిపురుష్
మరికొన్ని లెక్కల ప్రకారం…. ఈ సినిమా నైజాంలో రూ.50 కోట్లు, సీడెడ్‌లో రూ17.5 కోట్లు, వైజాగ్‌లో రూ.12.5 కోట్లు, వెస్ట్- రూ.7 కోట్లు, ఈస్ట్- రూ.8 కోట్లు, కృష్ణా- రూ.7.5 కోట్లు, గుంటూరు- రూ.9 కోట్లు, నెల్లూరు- రూ. 4 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. వీకెండ్స్‌లో ఈ కలెక్షన్స్ మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయట. శని, ఆదివారాలు ఈ కలెక్షన్స్ రూ. 250 కోట్లకు కూడా చేరవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి 2, సాహో మాత్రమే రూ. 100 కోట్లు వసూలు చేశాయి. దీంతో తాజాగా విడుదలైన ‘ఆదిపురుష్’ ఇప్పుడు ఆ కలెక్షన్స్‌ను దాటడం పక్కా అంటూ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో పఠాన్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ఆదిపురుష్’ రికార్డుల్లో నిలిచింది.
అమెరికాలో పాజిటివ్ టాక్
ఇండియాతో పాటు అమెరికాలోనూ ‘ఆదిపురుష్’ సినిమా మంచి టాక్ అందుకుంది. అక్కడ ఈ సినిమా తొలి రోజు దాదాపు మిలియన్‌కు పైగా యూఎస్ డాలర్ల గ్రాస్ కలెక్ట్ చేసి.. రికార్డ్ క్రియేట్ చేసిందని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ఈ క్రమంలో వీకెండ్ పూర్తయ్యేలోగా యూఎస్‌లో నాలుగు మిలియన్ల డాలర్లకు మేర కలెక్ట్ చేసేలా ఉందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. మంచి టాక్ హిట్‌తో డార్లింగ్ ప్రభాస్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి.
http://httpstwitter.compeoplemediafcystatus1669674375824699396cxt=HHwWiMDT2fP_76suAAAA
[vuukle]