'ఆదిపురుష్'​ ఫస్ట్​ డే కలెక్షన్స్​.. డార్లింగ్‌ ఖాతాలో మరో రికార్డ్​!​

ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్​లోనూ సందడి చేస్తోంది నిన్న ప్రభాస్​ యాక్ట్ చేసిన 'ఆదిపురుష్'​ మూవీ. శుక్రవారం రిలీజైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఇదిలాగే కంటిన్యూ అయితే బాహుబలి కలెక్షన్ల రికార్డును బ్రేక్‌ చేయనుందని టాక్. అయితే ఆదిపురుష్ తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే?

New Update
'ఆదిపురుష్'​ ఫస్ట్​ డే కలెక్షన్స్​.. డార్లింగ్‌ ఖాతాలో మరో రికార్డ్​!​

httpstwitter.compeoplemediafcystatus1669674375824699396cxt=HHwWiMDT2fP_76suAAAA

పస్ట్‌ డే ఆదిపురుష్ కలెక్షన్స్

పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్‌ రాఘవుడిగా తెరకెక్కిన మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్‌'. ఇందులో కృతిసనన్​, దేవదత్త నాగే, సైఫ్​ అలీఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్​ 16న భారత్​తో సహా ఓవర్సీస్​లోనూ రిలీజైంది. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 స్క్రీన్లలో రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం మంచి టాక్ అందుకుంటోంది. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్స్‌ల పరంగానూ దూసుకెళ్తోంది. ఇక తొలి రోజు సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లను రాబట్టి మంచి మార్క్‌ను అందుకుందని ట్రేడ్​ వర్గాల టాక్​.

రికార్డులను బ్రేక్ చేయనున్న ఆదిపురుష్

మరికొన్ని లెక్కల ప్రకారం.... ఈ సినిమా నైజాంలో రూ.50 కోట్లు, సీడెడ్​లో రూ17.5 కోట్లు, వైజాగ్​లో రూ.12.5 కోట్లు, వెస్ట్​- రూ.7 కోట్లు, ఈస్ట్- రూ.8 కోట్లు, కృష్ణా- రూ.7.5 కోట్లు, గుంటూరు- రూ.9 కోట్లు, నెల్లూరు- రూ. 4 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. వీకెండ్స్​లో ఈ కలెక్షన్స్​ మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయట. శని, ఆదివారాలు ఈ కలెక్షన్స్‌ రూ. 250 కోట్లకు కూడా చేరవచ్చని ట్రేడ్‌ వర్గాలు అంచనా. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి 2, సాహో మాత్రమే రూ. 100 కోట్లు వసూలు చేశాయి. దీంతో తాజాగా విడుదలైన 'ఆదిపురుష్' ఇప్పుడు ఆ కలెక్షన్స్​ను దాటడం పక్కా అంటూ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం హిందీలో పఠాన్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'ఆదిపురుష్' రికార్డుల్లో నిలిచింది.

అమెరికాలో పాజిటివ్ టాక్

ఇండియాతో పాటు అమెరికాలోనూ 'ఆదిపురుష్' సినిమా మంచి టాక్​ అందుకుంది. అక్కడ ఈ సినిమా తొలి రోజు దాదాపు మిలియన్​కు పైగా యూఎస్ డాలర్ల గ్రాస్ కలెక్ట్‌ చేసి.. రికార్డ్ క్రియేట్ చేసిందని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్​ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ఈ క్రమంలో వీకెండ్ పూర్తయ్యేలోగా యూఎస్‌లో నాలుగు మిలియన్ల డాలర్లకు మేర కలెక్ట్ చేసేలా ఉందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. మంచి టాక్‌ హిట్‌తో డార్లింగ్ ప్రభాస్‌ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి.

http://httpstwitter.compeoplemediafcystatus1669674375824699396cxt=HHwWiMDT2fP_76suAAAA

Advertisment
Advertisment
తాజా కథనాలు