తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో అశ్విన్‌ వినూత్న నిర్ణయం!

New Update

టీమ్‌ ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ - 2023 టోర్నీ తరుపున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా రవిచంద్రన్ ఆట మధ్యలో ఓ వినూత్న నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. తన నిర్ణయం ఏంటనేది పక్కన పెడితే తనెందుకు ఇలా బిహేవ్‌ చేశాడు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇంతకీ రవిచంద్రన్ చేసిందేంటో తెలుసుకోవాలంటే మాత్రం పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

httpstwitter.comFanCodestatus1669002311711215617cxt=HHwWgsDS7c-wvqkuAAAA

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ - 2023 లో వరుసగా అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాయి. ఇటీవలే చివరి బంతికి ఏకంగా 18 పరుగులు సమర్పించిన బౌలర్‌ను చూశాం. తాజాగా డీఆర్‌ఎస్‌ నిర్ణయంపైనే డీఆర్‌ఎస్ తీసుకున్న అరుదైన సన్నివేశం జరిగింది. ఇంతకీ అలా డీఆర్‌ఎస్‌ కాల్‌ తీసుకున్న బౌలర్‌ టీమ్ ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ కావడం గమనార్హం. ఇలా ఒకే బంతికి రెండుసార్లు ఇరు జట్లు డీఆర్‌ఎస్‌కు వెళ్లాయి.

టీఎన్‌పీఎల్‌లో భాగంగా దుండిగల్‌ డ్రాగన్స్‌ - బాల్సే త్రిచీ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ సీజన్‌లోనే తొలిసారి డీఆర్‌ఎస్ విధానం అమల్లోకి తెచ్చారు. దుండిగల్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌ బౌలింగ్‌లో (12.5వ ఓవర్‌) త్రిచీ బ్యాటర్ రాజ్‌కుమార్‌ బంతిని ఎదుర్కొన్నాడు. అయితే.. బ్యాట్‌ను తాకినట్లు భావించి అశ్విన్‌ అప్పీలు చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో త్రిచీ బ్యాటర్ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. తీరా అక్కడ మాత్రం బ్యాట్‌ నేలను తాకినట్లుగా.. బంతి కాస్త పక్కకు వెళ్లినట్లు ఉండటంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ వెంటనే అశ్విన్‌ మరోసారి డీఆర్‌ఎస్‌ కోరుతూ సంజ్ఞ చేశాడు. మరోసారి సమీక్షించిన థర్డ్‌ అంపైర్ ‘నాటౌట్‌’గానే నిర్ణయం ప్రకటించాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ కూడా బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించడంతో అశ్విన్‌ అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్యాన్‌ కోడ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేసింది.

ఇలా రెండోసారి డీఆర్‌ఎస్‌కు వెళ్లడంపై అశ్విన్‌ స్పందిస్తూ..ఈ టోర్నీకి డీఆర్‌ఎస్‌ కొత్తగా అమల్లోకి వచ్చింది. బ్యాట్‌ను బంతి దాటేటప్పుడు స్పైక్స్‌ కనిపించాయి. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం సరిగా లేదనిపించి నిరుత్సాహానికి గురయ్యా. వారు సరిగా చూడలేదేమోననిపించింది. అందుకే మరోసారి డీఆర్‌ఎస్‌ తీసుకోవడానికి మొగ్గు చూపా.. అని వివరించాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న దుండిగల్‌ డ్రాగన్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. త్రిచీ నిర్దేశించిన 121 పరుగుల టార్గెట్‌ను 14.5 ఓవర్లలోనే డ్రాగన్స్‌ ఛేదించింది.

https://twitter.com/FanCode/status/1669002311711215617?cxt=HHwWgsDS7c-wvqkuAAAA

Advertisment
Advertisment
తాజా కథనాలు