వరంగల్ లో వరద బాధితులకు గవర్నర్ సహాయం..కేసీఆర్ సర్కార్ కు తమిళి సై కీలక సూచనలు!

వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులతో మాట్లాడి వారి బాధను ఆమె పంచుకున్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ కు పలు కీలక సూచనలు చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ లేక కేటీఆర్ వస్తారని ప్రభుత్వ అధికార వర్గాలు భావించిన నేపథ్యంలో గవర్నర్ తమిళి సై వరంగల్ లో పర్యటించి బాధితులకు సహాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వరంగల్ లో వరద బాధితులకు గవర్నర్ సహాయం..కేసీఆర్ సర్కార్ కు తమిళి సై కీలక సూచనలు!
New Update

Governors Help to the flood victims in Warangal: వరంగల్ జిల్లాలో బుధవారం పర్యటించిన రాష్ట్ర గవర్నర్ తమిళి సై(Governor Tamilisai Soundararajan) వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులతో మాట్లాడి వారి బాధను ఆమె పంచుకున్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ (KCR) సర్కార్ కు పలు కీలక సూచనలు చేశారు.

భారీ వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే తీవ్రమైన ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుందన్నారు గవర్నర్ తమిళి సై. అయితే వరంగల్ పట్టణానికి నలువైపులా ఉన్న చెరువులకు వరద పోటెత్తిన కారణంగా ఈ పరిస్థితి చోటుచేసుకుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ వరద బాధితులను ఆదుకోవాలని, ముంపు ప్రాంతాల్లో పరిశీలించి, ప్రజల పరిస్థితిని చూసి సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.

ఇక వరంగల్ పట్టణంలో స్థానిక ప్రజలు చాలా ఏళ్లుగా జవహర్ నగర్ కాలనీ బ్రిడ్జిని పున: నిర్మించాలని కోరుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు గవర్నర్. అయితే ఉదయం 6 గంటలకు రాజ్ భవన్ నుంచి బయల్దేరిన తమిళి సై 8.30 గంటలకు ఎన్ ఐటీకి చేరుకున్నారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన జవహర్ నగర్, ఎన్టీఆర్ నగర్, ఎన్ ఎన్ నగర్, భద్రకాళి బండ్, నయిం నగర్ ఏరియాల్లో పర్యటించారు.

తరువాత రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైజనిక్, క్లాత్స్ పంపిణీ చేశారు. అయితే వరంగల్ ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో వరద బాధితులను పరామర్శించేందుకు కేసీఆర్ లేక కేటీఆర్ వస్తారని ప్రభుత్వ అధికార వర్గాలు భావించినా.. అలా జరగలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళి సై వరంగల్ లో పర్యటించి వరద బాధితులకు సహాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

#governor-tamilisai #governor-tamilisai-soundararajan #governors-help-to-the-flood-victims-in-warangal #warangal-victims
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe