HRA Rules: మీరు ప్రభుత్వ ఉద్యోగా? అయితే ఈ HRA రూల్ తెలుసుకోకపోతే చిక్కుల్లో పడతారు!

పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి కేటాయించిన అద్దె లేని ఇంటిలో ఉంటున్న వారి కొడుకు ప్రభుత్వ ఉద్యోగి అయితే, అతనికి HRA క్లెయిమ్ చేసే అర్హత ఉండదని ఇటీవల సుప్రీం కోర్టు ధర్మాసనం ఒక కేసు విషయంలో స్పష్టం చేసింది. ఈ HRA రూల్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

HRA Rules: మీరు ప్రభుత్వ ఉద్యోగా? అయితే ఈ HRA రూల్ తెలుసుకోకపోతే చిక్కుల్లో పడతారు!
New Update

HRA Rules: మీరు ప్రభుత్వ ఉద్యోగి అయివుంటే.. ఇంటి అద్దె అలవెన్స్ (HRA) క్లెయిమ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే, ఈ రూల్ తెలుసుకోండి. మీ తండ్రి కనుక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఆయనకు అద్దె లేకుండా ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో మీరు నివసిస్తూ ఉంటే మీకు ఇంటి అద్దె అలవెన్స్ (HRA) క్లెయిమ్ చేసే అర్హత లేదు. అవును.. ఇటీవల సుప్రీం కోర్టు ఒక కేసు విషయంలో దీనిని స్పష్టం చేసింది. ఆ కేసు వివరాలు.. సుప్రీం కోర్టు ఏమి చెప్పిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

HRA Rules: జమ్మూకాశ్మీర్ లో 30 ఏప్రిల్ 2014న తన సర్వీస్ నుంచి రిటైర్ అయిన ఒక ఉద్యోగికి అద్దె లేకుండా ప్రభుత్వం ఇంటిని కేటాయించింది. అతని కొడుకు అదే ఇంటిలో అతనితో పాటు కలిసి నివాసం ఉంటున్నాడు. అతను కూడా ప్రభుత్వ ఉద్యోగి. అయితే, అతను తాను పనిచేస్తున్న విభాగం నుంచి HRA క్లెయిమ్ చేస్తూ వచ్చాడు. అయితే, సదరు ఉద్యోగి తన తండ్రికి అద్దె లేకుండా ప్రభుత్వం కేటాయించిన ఇంటిలో నివాసం ఉంటున్నాడంటూ సంబంధిత శాఖకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేసిన అధికారులు అది వాస్తవమే అని నిర్ధారించుకున్నారు. దీంతో ఆ ఉద్యోగి క్లెయిమ్ చేసిన రూ.3,96,814/- మొత్తాన్ని డిపాజిట్ చేయాలని నోటీసు ఇచ్చారు అధికారులు. 

Also Read: అమెరికన్ల కంటే భారతీయులే మేలు..అమెరికా రాయబారి!

HRA Rules: ఈ నోటీసులపై ఆ ఉద్యోగి కోర్టులో అప్పీల్ చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు BR గవాయ్, సందీప్ మెహతా లతో కూడిన ధర్మాసనం "అప్పీలుదారు ప్రభుత్వ ఉద్యోగి అయినందున, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి అయిన తన తండ్రికి కేటాయించిన అద్దె-రహిత వసతిని పంచుకుంటూ హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేయలేరు. జోక్యానికి హామీ ఇచ్చే ఇంప్యుగ్డ్ ఆర్డర్‌లలో ఎటువంటి బలహీనత లేదు" అని స్పష్టం చేస్తూ.. ఆ ఉద్యోగి క్లెయిమ్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందే అని తీర్పునిచ్చింది.  

ఈ తీర్పు నేపథ్యంలో అసలు HRA రూల్స్ ఏమి చెబుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. 

HRA Rules: 1992 రూల్స్‌లోని రూల్ 6(హెచ్)(iv) ప్రకారం, ఒక కుటుంబంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది సభ్యులు పనిచేస్తున్నప్పుడు-వారు ప్రభుత్వం ఇచ్చే గృహాలలో కలిసి జీవిస్తున్నప్పుడు, వారిలో ఒకరు మాత్రమే గృహ భత్యాన్నిఅంటే HRA పొందగలరు. 

రూల్ 6 ప్రకారం HRA మంజూరు కింది షరతులకు లోబడి ఉంటుంది:

(h) ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంటి అద్దె భత్యానికి అర్హులు కాదు:

(iv) భర్త/భార్య/తల్లిదండ్రులు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా కేంద్ర ప్రభుత్వం, స్వయంప్రతిపత్త పబ్లిక్ అండర్‌టేకింగ్‌లు లేదా పాక్షిక ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు మరొక ప్రభుత్వ సేవకుడికి కేటాయించిన వసతిని పంచుకున్న సందర్భాల్లో, ఇంటి అద్దె భత్యం అనుమతించబడుతుంది. అయితే వారిలో ఒకరికి మాత్రమే."

ఈ రూల్స్ ఆధారంగా సుప్రీం కోర్టు ధర్మాసనం అప్పీల్ దారునికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. 

#supreme-court #hra-rules
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe