/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-11T194417.893-jpg.webp)
Car Tips: ఎండాకాలంలో ఉదయం, సాయంత్రం వాతావరణం కొద్దిగా చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం భానుడు భగభగ మండిపోతాడు. ఎండాకాలం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మన వాహనాలను సంరక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మీకు CNG కారు ఉంటే.. మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వేసవి కాలంలో సీఎన్‌జీ కారును సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే వాహనానికి ఇబ్బందులు తప్పపు. వేసవిలో మీ CNG కారు ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
సూర్యకాంతి నుంచి రక్షణ
మీకు CNG కారు ఉంటే వేసవి కాలంలో ఎండలో పార్కింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇది కారు లోపల క్యాబిన్ వేడెక్కడానికి కారణమవుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే CNG కారును నీడలోనే పార్క్ చేయాలి.
గ్యాస్ రీఫిల్లింగ్
వేసవిలో కారు గ్యాస్ సిలిండర్‌ను పూర్తిగా ఫిల్ చేయకూడదు. పూర్తిగా నింపడం ద్వారా అధిక వేడికి కారణమవుతుంది. అందుకే సాధారణంగా ఫీల్ చేసే మోతాదు కంటే ఒకటి లేదా రెండు కిలోల గ్యాస్ తక్కువగా నింపేలా చూసుకోండి.
లీక్స్ చెక్ చేయండి
సహజంగా CNG(Compressed natural gas ) కిట్‌ను కంపెనీలే కారులో అమర్చుతాయి. అయితే చాలా మంది ఈ కిట్‌ను సపరేటుగా ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అయితే కార్ లోని CNG ట్యాంకులు కొన్ని సార్లు లీక్ అవ్వడం జరుగుతుంది. వాటిని తరచూ చెక్ చేసుకోవాలి. గ్యాస్ ట్యాంక్ ఫుల్ గా నింపడం, ట్యాంక్ వాల్వ్ సరిగా అమర్చకపోవడం లీకేజ్ కు కారణం.
హైడ్రో టెస్టింగ్:
CNG వాహనదారులు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు హైడ్రో టెస్టింగ్ చేస్తూ ఉండాలి. మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు హైడ్రో టెస్టింగ్ చేయకుంటే, మీ CNG కారు సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఈ సమస్య సమ్మర్‌లో మరింత ఎక్కువగా ఉంటుంది. కావున హైడ్రో టెస్టింగ్ తప్పక చేయించాలి.
Also Read: Health tips: ఏంటీ ఊరికే ఏదో ఒకటి తినాలనిపిస్తుందా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్లే..!