Kitchen Tips: మీ ఫ్రిడ్జ్ లో ఐస్ పేరుకుపోతుందా.. దానికి కారణమేంటో తెలుసా

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నవారు సహజంగా ఎదుర్కునే సమస్య ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోవడం. దీన్ని క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి కారణాలు ఇవే. ఎవాపరేటర్ కాయిల్, వాటర్ ఫిల్టర్, ఫ్రిడ్జ్ డోర్ పాడైనప్పుడు ఫ్రీజర్ లో ఐస్ పేరుకుపోవడం జరుగుతుంది.

New Update
Kitchen Tips: మీ ఫ్రిడ్జ్ లో ఐస్ పేరుకుపోతుందా.. దానికి కారణమేంటో తెలుసా

Kitchen Tips: సహజంగా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న ప్రతీ ఒక్కరు ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్య ఫేస్ చేసి ఉంటారు. ఫ్రీజర్ లో ఐస్ పర్వతంలా పేరుకుపోతూ ఉంటుంది. అసలు దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని సార్లు ఏవైనా ఆహారాలు కూడా పెట్టలేనంతగా ఫ్రీజర్ అంత ఐస్ తో నిండి ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కూలింగ్ ఎక్కువ కావడం వల్ల ఇలా జరుగుతుందేమోనని ఆలోచిస్తారు. అసలు ఫ్రీజర్ ఇలా జరగడానికి కారణమేంటో తెలుసుకుందాం..

ఫ్రీజర్ లో ఐస్ పేరుకుపోవడానికి కారణాలు

వాటర్ ఫిల్టర్

ఫ్రిడ్జ్ లో నీటిని శుభ్రపరిచే వాటర్ ఫిల్టర్ పాడైనప్పుడు.. లేదా సరిగ్గా పని చేయనప్పుడు ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కావున వాటర్ ఫిల్టర్ పాడైనపుడు వెంటనే కొత్తది రీప్లేస్ చేయాలి. లేదంటే ఏవైనా ఆహారాలు పెట్టినప్పుడు మంచులో కూరుకుపోతాయి.

publive-image

Also Read: Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే

ఎవాపరేటర్ కాయిల్

ఎవాపరేటర్ కాయిల్ దెబ్బతినడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. ఇది ఫ్రిడ్జ్ లోని ఎక్స్ట్రా వాటర్ ను బయటకు పంపించడానికి సహాపడుతుంది. ఇది డ్యామేజ్ కావడంతో.. నీళ్లు అలాగే ఉండిపోయి ఐస్ లా మారుతాయి. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే ఈజీ అవుతుంది. లేదంటే మంచు ఎక్కువగా పేరుకుపోతుంది.

publive-image

ఫ్రిడ్జ్ డోర్

ఫ్రిడ్జ్ డోర్ లేదా డోర్ సైడ్స్ లో ఉండే రబ్బర్ పాడైనపుడు కూడా ఈ సమస్య వస్తుంది. డోర్ టైట్ గా లేకపోవడం వల్ల బయట గాలి లోపలి చేరుతుంది. ఇది లోపల ఐస్ ఫార్మ్ అవ్వడానికి కారణమవుతుంది. కావున డోర్ ఫ్రిడ్జ్ డ్యామేజ్ ఉన్నప్పుడు వెంటనే మార్చాలి.

సాధారణంగా ఫ్రిడ్జ్ ఎక్కువ కాలం బాగా పనిచేయాలంటే.. ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అలాగే కనీసం సంవత్సరానికి ఒక సారైన టెక్నీషియన్స్ తో చెక్ చేయించాలి. అంతే కాదు ఫ్రిడ్జ్ ను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.

Also Read: Carrot Lemon Rice: పిల్లల కోసం హెల్తీ క్యారెట్ లెమన్ రైస్.. ట్రై చేయండి.. అదిరిపోతుంది

Advertisment
తాజా కథనాలు