Carrot Lemon Rice: పిల్లల కోసం హెల్తీ క్యారెట్ లెమన్ రైస్.. ట్రై చేయండి.. అదిరిపోతుంది

రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ హెల్తీ గా తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు బ్రేక్ ఫాస్ట్ విషయంలో రోజూ ఏదైనా వెరైటీగా కావాలని ఇష్టపడతారు.రొటీన్ గా కాకుండా హెల్తీగా క్యారెట్ లెమన్ రైస్ ట్రై చేయండి. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Carrot Lemon Rice: పిల్లల కోసం హెల్తీ క్యారెట్ లెమన్ రైస్.. ట్రై చేయండి.. అదిరిపోతుంది

Carrot Lemon Rice: సహజంగా రోజూ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ అది రుచిగా మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. డైలీ తినే పులిహోర, టమాటో రైస్ , పూరి, దోశ కామన్. ఇలా కాకుండా కాస్త హెల్తీగా,కొత్తగా, వెరైటీగా ఉండడానికి క్యారెట్ లెమన్ రైస్ ట్రై చేయండి. పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టంగా తింటారు. ఇది  బ్రేక్ ఫాస్ట్ గా మాత్రమే కాదు లంచ్ బాక్స్ లో కూడా తీసుకెళ్లొచ్చు. లెమన్ రైస్ లో కాస్త న్యూట్రియెంట్స్ వ్యాల్యు పెంచడానికి క్యారెట్ వేస్తే సరిపోతుంది. ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ లెమన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

క్యారెట్ తురుము: 1 (క్యారెట్ లేదా మీకు సరిపడ) నిమ్మరసం: 1/4, పచ్చి మిర్చి: 4 లేదా 5, నూనె: 2 టేబుల్ స్పూన్స్, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర: సరిపడినంత, బాస్మతి లేదా నార్మల్ రైస్: 1 కప్పు, ఆవాలు: 1 టేబుల్ స్పూన్, మినపప్పు: 11/2 టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు: మూడు రెమ్మల, టెస్ట్ కోసం: ఇంగువ, వేయించిన శనగలు, జీడిపప్పు, కొత్తిమీర

తయారీ విధానం

  • ముందుగా బాస్మతి రైస్ కుక్కర్ లో వేసి.. ఒక రెండు కప్పుల నీళ్లు పోయాలి . ఆ తర్వాత దాంట్లో కాస్త రుచి కోసం చిటికెడు ఉప్పు, నెయ్యి వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఈ రైస్ పక్కన పెట్టి.. చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు ఒక పాన్ స్టవ్ పై పెట్టి దాంట్లో నూనె లేదా నెయ్యి వేయాలి. అది కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, వెల్లులి, ఉల్లిపాయలు, జీడిపప్పు, శనగలు, పల్లీలు, ఇంగువ వేసి కాసేపు వాటిని వేయించాలి.

Also Read: Morning Tips : ఏంటీ రోజంతా బద్దకంగా ఉంటుందా..? అయితే మీరు ఇవి చేయాల్సిందే

publive-image

  • ఆ తర్వాత పచ్చి మిర్చి, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఉంచాలి. ఆ తర్వాత దీంట్లో సన్నగా తరిమిన క్యారెట్ వేసి.. పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
  • ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. చివరిలో కొంచం నిమ్మరసం పిండాలి. దీంతో క్యారెట్ రైస్ కు కావాల్సిన తాలింపు సిద్దమైనట్లే.
  • చివరిగా ఈ మిశ్రమంలో ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేసి.. అంతా మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. ఈజీ, టేస్టీ, అండ్ హెల్తీ క్యారెట్ లేమాన్ రైస్ రెడీ.

publive-image

Also Read: COFFEE: ఏంటీ కాఫీ ఎక్కువ తాగేస్తున్నారా..? అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు