Skin Care: అందానికి కొబ్బరి క్రీమ్‌.. ఈ సమ్మర్‌లో బెస్ట్‌ చిట్కా!

ఇంట్లో కొబ్బరి క్రీమ్‌ను తయారు చేయడం చాలా సులభం. మీ చర్మాన్ని అందంగా మార్చుకునేందుకు కొబ్బరి క్రీమ్‌ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా కొబ్బరి క్రీమ్ ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్‌ మొత్తం చదివి తెలుసుకోండి.

New Update
Skin Care: అందానికి కొబ్బరి క్రీమ్‌.. ఈ సమ్మర్‌లో బెస్ట్‌ చిట్కా!

Summer Skin Tips: వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. ఎండలు దంచికొడుతున్నాయి. పగటిపూట వచ్చే బలమైన సూర్యరశ్మి కారణంగా చర్మ సమస్యలు రావొచ్చు. గ్లో కూడా పోవచ్చు. ఈ సీజన్‌లో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ సీజన్ లో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి కాలంలో చర్మానికి సంబంధించిన ప్రతి సమస్యకు పార్లర్లను విజిట్ చేస్తున్నారు అమ్మాయి. స్కిన్ కేర్ ట్రీట్ మెంట్స్ అందుబాటులో ఉన్నా హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం బెటర్. మీరు కూడా ఇక నుంచి మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, ఈ రోజు ఇంట్లో కొబ్బరి క్రీమ్‌ని యూజ్ చేయండి. దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

క్రీమ్ తయారీ ఇన్‌గ్రేడియంట్స్:

--> 1 కప్పు కొబ్బరి నూనె
--> 1 టీస్పూన్ నేచురల్ అలోవెరా (1 టీస్పూన్)
--> 1 నుంచి 2 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్

ఎలా తయారు చేయాలి:
కొబ్బరి క్రీమ్ తయారు చేయడానికి మొదట కరిగించిన కొబ్బరి నూనె, తాజా కలబంద జెల్ ను ఒక గిన్నెలో తీసుకోండి. వాటిని బాగా కలపాలి. అప్పుడు అది కరిగిపోతుంది. కావాలనుకుంటే హ్యాండ్ మిక్సర్ ను ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి. కావాలనుకుంటే లావెండర్, పిప్పరమింట్ లేదా సిట్రస్ ఆయిల్‌ను ఎంచుకోవచ్చు. వీటిని బాగా కలపాలి. మీ కొబ్బరి క్రీమ్ ఇప్పుడు సిద్ధమవుతుంది. పొడి చర్మం ఉన్నవారికి ఈ రెమెడీ ఒక వరం. ఈ క్రీమ్ ను ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఈ క్రీమును 10 రోజులకు మించి ఉపయోగించకూడదు.

Also Read: దీపికా కూడా సరోగసీ ద్వారానే బేబీని కనబోతుందా? ఇందులో నిజమెంత?

Advertisment
Advertisment
తాజా కథనాలు