ఏ ఇంట్లోనైనా అత్తగారు, కోడలు బాగానే ఉంటారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు ఉండనట్లయితే.. అంటే ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుంది. మీకు, మీ అత్తగారికి మధ్య మంచి సంబంధాన్ని కొనసాగించాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
చాలా కుటుంబాలలో కోడలు మీద పెత్తనం అత్తగారిదే ఉంటుంది. ఆమె చెప్పినట్లు వినాల్సిందే..నడుచుకోవల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా...చివాట్లు తినాల్సిందే. అయితే ఇదంతా ఒక్కప్పుడు. ఇప్పుడు కాలం మారింది. ఆలోచన విధానాలూ మారాయి. అత్తాకోడళ్లు కలిసి ఉంటున్న ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి. అత్తలో అమ్మను..కోడలిలో కూతురును చూసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు పెళ్లికి ముందే అత్తగారిని ఎలా మెప్పించాలో కోడలు నేర్చుకోవాలి. అది వంట చేయడం, అత్తగారితో మాట్లాడడం లేదా కొడుకును చూసుకోవడం కావచ్చు. మీరు మీ అత్తగారిని గెలవాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
షాపింగ్ తీసుకెళ్లండి:
షాపింగ్ అంటే ప్రతి మహిళ ఇష్టపడే విషయం. మీ అత్తగారికి ఎలాంటి వస్తువులు అంటే ఇష్టమో మీకు తెలిసే ఉంటుంది. అలా మీ అత్తగారిని షాపింగ్ తీసుకెళ్ళి ఆమెకు నచ్చిన వస్తువులు కొనిపెడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అత్తగారికి చీరలంటే ఇష్టం ఉంటే...ఆమెను తీసుకెళ్లి కొనివ్వండి. ఆమెలో ఆనందాన్ని చూడండి.
యాత్రకు తీసుకెళ్లండి:
భర్తతో ట్రిప్, ఫ్రెండ్స్ తో ట్రిప్ ఇవన్నీ సర్వసాధారణం. అయితే మీరు, అత్తగారికి నచ్చిన ప్రదేశం ఏంటో తెలుసుకుని..ఆమెను అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. వారితో కలిసి ప్రయాణం చేస్తే మీగురించి ఆమెకు పూర్తిగా అర్ధం అవుతుంది. అత్తగారితో కలిసి గడిపిన సమయం వారి మధ్య పరస్పర అవగాహనను బలోపేతం చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది.
డిన్నర్:
జంటలకు మాత్రమే డేటింగ్ అని ఎక్కడా చెప్పలేదు. మీరు మీ అత్తగారితో డేటింగ్‌కు వెళ్లవచ్చు. ఇది శృంగార సంజ్ఞ కాదు. బదులుగా, ఇది సాధారణ విందు. ఈ డిన్నర్ లో మీరు మీ అత్తగారు మాత్రమే ఉంటారు. ఈ రకమైన డిన్నర్ డేట్ మీ అత్తగారిని బయటకు తీసుకెళ్లడానికి సులభమైన మార్గం. కలిసి సమయాన్ని గడపడానికి మీరు దీన్ని మొదటి అడుగుగా తీసుకోవచ్చు. షాపింగ్‌కు వెళ్లడం లేదా విహారయాత్రకు వెళ్లడం ఆమెకు అసౌకర్యంగా ఉండవచ్చు. కానీ ఆమె మీతో డిన్నర్‌లో చేరేందుకు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: రైతులకు అలర్ట్…15వ విడత డబ్బు జమకాలేదా? డబ్బు వచ్చేస్తోంది..చెక్ చేసుకోండి..!!