ఫాన్సీ మొబైల్ నంబర్ కావాలా?.. అయితే, ఇలా చేయండి..!!

మీరు బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లా? మీకు ఫ్యాన్సీ నెంబర్ కావాలా? అయితే ఆన్ లైన్ ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఈ అవకాశం నవంబర్ 20 వరకు అందుబాటులో ఉండనుంది.

ఫాన్సీ మొబైల్ నంబర్ కావాలా?.. అయితే, ఇలా చేయండి..!!
New Update

భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు మంచి ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ వేలం పాట ఆన్ లైన్లో నిర్వహిస్తోంది. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు ఆన్ లైన్లో పాల్గొని ఫ్యాన్సీ నెంబర్ తో కూడి సిమ్ కార్డు సొంతం చేసుకునే బంపర్ ఆఫర్ నవంబర్ 11 నుంచి షురూ అయ్యింది. ఈ వేలం నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అయితే ఈ ఫ్యాన్సీ నెంబర్లు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, యూపీలలో మాత్రమే వేలం వేస్తున్నారు.ప్రస్తుతం దేశంలో రోమింగ్ విధానం అందుబాటులో లేకపోవడంతో ఏ రాష్ట్రంలో సిమ్ కార్డును ఏ రాష్ట్రంలో అయినా ఉపయోగించుకోవచ్చు.

అందుబాటులోఉన్న నెంబర్లు, ధర వివరాలు:

8300000022 నెంబర్ కొనుగోలు చేయాలంటే రూ. 25 వేల ప్రారంభం అవుతుంది. 8300001234 నెంబర్ రూ. 10వేల నుంచి ప్రారంభమవుతుంది. 8300012345 మొబైల్‌ నెంబర్‌ రూ. 10 వేల నుండి ప్రారంభమవుతుంది. 8300010001 మొబైల్ నెంబర్ రూ. 8 వేలు... 8300020002, 8300030003 రెండు నెంబర్లు రూ. 8 వేల నుంచి వేలం ప్రారంభం కానున్నాయని తెలిపింది. రూ. 5 వేల నుంచి ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ను కూడా వేలంపాట అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో.. 8300081000, 8300082000, 8300083000 మొబైల్‌ నెంబర్లను రూ. 5 వేల వేలంపాట నుంచి ప్రారంభవుతున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్‌ https://eauction.bsnl.co.in/ లోకి వెళ్లి మొబైల్ నెంబర్‌ యాక్షన్ విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో మొబైల్‌ నెంబర్‌ వేలంపాటలో పాల్గొనవచ్చని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి:  రాత్రి పడుకునే ముందు ఈ పని చేయండి…చర్మం మృదువుగా మెరుస్తుంది..!!

#fancy-numbers #basnl
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe