ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకా రెండు రోజులే గడువు...ఈ రోజే ఈ పని చేయండి...!! ఇప్పటివరకు 7 కోట్ల రిటర్న్స్ దాఖలు అయినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఇంకా రెండు రోజులే గడువు మిగిలి ఉన్నందున త్వరగా రిటర్నులు ఫైల్ చేయాలని ట్యాక్స్ పేయర్లకు సూచించింది ఐటీ శాఖ. By Bhoomi 29 Jul 2023 in బిజినెస్ Scrolling New Update షేర్ చేయండి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు గడువు సమీపించింది. జూలై 31తో ఈ గడువు ముగుస్తుంది. అంటే ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రిటర్నులు దాఖలు చేయనివారు త్వరగా రిటర్నులు ఫైల్ చేయాలని ఐటీశాఖ సూచిస్తూ శుక్రవారం ట్వీట్ చేసింది. ఓవైపు దాఖలుకు ఇంకా గడువు పొడగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖ ఈ ట్వీట్ చేసింది. జూలై 27 వరకు 7కోట్ల ఐటీఆర్ లు దాఖలయ్యాయని ఐటీశాఖ వెల్లడించింది. అంతేకాదు 4.46కోట్ల రిటర్నులు ఇ వెరిఫికేషన్ కూడా పూర్తయ్యిందని పేర్కొంది. ఇ -వెరిఫై చేసిన ఐటీఆర్ లలో 2.69కోట్ల ఐటీఆర్ లను ప్రాసెస్ చేసినట్లు ఐటీ శాఖ ట్వీట్ లో తెలిపింది. మీరు రిటర్న్ కూడా దాఖలు చేయకపోతే.. వీలైనంత త్వరగా ఈ పనిని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కేవలం 2 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. జూలై 31 తర్వాత రిటర్న్ ఫైల్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి పన్ను చెల్లింపుదారులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఆన్ లైన్ మోడ్‌లో ఎలా రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చో తెలుసుకుందాం. ఆన్ లైన్ మోడ్‌లో రిటర్న్ ఫైల్ చేయడం ఎలా? -మీరు ITR ఆన్ లైన్‌లో ఫైల్ చేయాలనుకుంటే, మీరు ముందుగా ITR ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయాలి . -డౌన్ లోడ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని..మీ ఆదాయానికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. -ఇప్పుడు మీరు ITR ఫారమ్ ఎక్సెల్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. - జిప్ ఫైల్‌ను తెరిచి, అవసరమైన నిలువు వరుసలను పూరించాలి. - మీ ఎక్సెల్ షీట్‌ను ధృవీకరించాలి.పన్ను లెక్కించుపై క్లిక్ చేయాలి. -ఇప్పుడు XML యుటిలిటీని రూపొందించి.. దానిని సేవ్ చేయండి. - పోర్టల్‌లో ఎక్సెల్ యుటిలిటీని అప్‌లోడ్ చేయాలి. - 6 ఆప్షన్స్ నుండి ITRని ధృవీకరించాలి. -ఇప్పుడు మీరు మీ రిటర్న్ ఫారమ్‌ను సమర్పించవచ్చు. రిటర్న్ ఫైల్‌లో సమస్య ఉంటే: ITR ఫైల్ చేయడంలో ఎవరైనా పన్ను చెల్లింపుదారులకు ఏదైనా సమస్య ఉంటే ఆదాయపు పన్ను అధికారిక పోర్టల్‌ని సందర్శించవచ్చు. ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు ( https://www.incometax.gov.in/iec/foportal/help/offline-utility దీని తర్వాత మీరు స్క్రీన్‌పై చూపిన దశలను అనుసరించడం ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. #itr #tax-return మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి