How to Drive Safely in Fog: సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. తాజాగా, పొగ మంచులో డ్రైవింగ్ ఎలా చేయాలి? అని తెలిపుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. సంవత్సరంలో ఇతర నెలలో పోలిస్తే నవంబర్, డిసెంబర్ నెలలో ఎక్కువుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని తెలిపారు. దీనికి కారణం రాత్రి, ఉదయం పొగ మంచు ఎక్కువుగా కురవడం వల్ల డ్రైవర్ కు తన ముందు వస్తున్న వాహనాలు సరిగా కనిపించకపోవడం అని చెప్పుకొచ్చారు. కొంత మంది హైవేలపై వాహనాలు పార్క్ చేయడం వలన ఇతర వాహనాలకు మంచు వల్ల అవి కనిపించక వెనుక నుండి ఢీ కొంటు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు.
Also Read: నీళ్లు తాగుతూ కుప్పకూలిన క్రికెటర్.. చిన్నవయసులోనే ఊహించని మరణం!
రాత్రి, తెల్లవారు జామున అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల కూడా ఎక్కువుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. కాబట్టి వీలయైనంత వరకు రాత్రి, తెల్లవారు జామున ప్రయాణం చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి అయితే నిదానంగా వెళ్లాలని చెబుతున్నారు. మార్నింగ్ వాక్ కు వెళ్లేవారు జాతీయ రహదారుల్లో వెళ్లకుండా ఇతర మార్గాల ద్వారా వెళ్లడం మంచిదని తెలిపారు. ఈ క్రమంలోనే వాహనాదారులు ఎట్టి పరిస్థితిల్లోనూ వాహనాలను రోడ్డుపై పార్క్ చేయకుడదంటూ హెచ్చరిస్తున్నారు. కూడళ్ల వద్ద ఇంకా జాగ్రాత్తగా ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు. ఒకవేళ వెహకిల్ బ్రేక్ డౌన్ అయితే రెఫ్లెక్టివ్ ట్రై యాంగిల్స్ ఉంచాలని హెచ్చరిస్తున్నారు. బండి లైట్లు సరిగా పనిచేస్తున్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇలా సేఫ్ గా డ్రైవ్ చేస్తూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు.