ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవటం ఎంతముఖ్యమో వ్యాయామం చేయటం కూడా అంతే ముఖ్యం. వాకింగ్ శరీరానికే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉపయోగపడుతుంది. వ్యాయామాల విషయానికి వస్తే అన్నింటిలోనూ చాలా తేలికైంది, ఖర్చు అవసరం లేనిది.. వాకింగ్. రోజూ వాకింగ్ చేయడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వాకింగ్‌ను కింద తెలిపిన విధంగా చేస్తే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
వాకింగ్ ఏ సమయంలో చేస్తే బరువు తగ్గుతారు..?
ఉదయాన్నే నడవడం వల్ల చాలా లాభాలున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 30 నిమిషాలు నడిస్తే బెల్లీ ఫ్యాట్ బర్న్ అవ్వడంతో చాలా లాభాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
New Update
వాకింగ్ చేసే వారు రోజుకు కనీసం గంట అయినా వాకింగ్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే గంట సేపు వాకింగ్ ఒకేసారి చేయలేకపోతే ఉదయం, సాయంత్రం 30 నిమిషాల చొప్పున చేయవచ్చు. ఇలా వాకింగ్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు. వాకింగ్‌ను ప్రారంభించేటప్పుడు నెమ్మదిగా నడవాలి. క్రమంగా వేగం పెంచాలి.
Advertisment