AI Anchor: ఏఐ యాంకర్‌కి ఎలా శిక్షణ ఇస్తారు..? ఏ టూల్స్ ఉపయోగిస్తారు..? ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్లపై సోషల్‌మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఒడిశా టీవీ తర్వాత తెలుగులో బిగ్‌టీవీ మాయ పేరుతో ఓ ఏఐ న్యూస్‌రీడర్‌ని పరిచయం చేసింది. దీంతో అసలు ఏఐ యాంకర్లకు ఎలా శిక్షణనిస్తారు..? ఏ టూల్స్‌తో వీడియోని క్రియేట్ చేస్తారన్నదానిపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. By Trinath 13 Jul 2023 in Scrolling ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో అద్భుతాలు సృష్టించనున్న కాలంలోకి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం.. ఇప్పటివరకు కనపించిన..కనిపిస్తున్న ఏఐ వండర్స్ ఓ శాంపుల్ మాత్రమే. తర్వాత కనిపించబోయే విచిత్రాలు, విడ్డూరాలు ఊహకందనవి..! దాదాపు ప్రతి రంగంలోనూ త్వరలో చాట్‌బాట్‌లు రాబోతున్నాయి. టీచింగ్ దగ్గర నుంచి యాంకరింగ్ వరకు ప్రతిదీ ఏఐ ద్వారా వినియోగంలోకి రానుంది. ఇది జరగడానికి ఎక్కువ కాలం కూడా పట్టే సమయంలేదు. ప్రస్తుత పోటి ప్రపంచంలో ఇతరుల కంటే ముందుండాలన్న ఆలోచనతో ఇప్పటికే కంపెనీలు..పలు కార్పొరేట్ సంస్థలు ఏఐ వైపు ఫోకస్ పెంచుతున్నాయి. ఉద్యోగుల స్థానంలో చాట్‌బాట్‌లను క్రియేట్ చేసుకోని పని చేయించుకుంటున్నాయి. ఇటివలి మీడియా రంగంలోనూ ఏఐ ఎంట్రీ ఇచ్చింది. పలు న్యూస్ ఛానెల్స్ ఏఐ యాంకర్లను క్రియేట్ చేసి వాటితో వార్తలు చదివించాయి. దీంతో అటు ప్రజల్లో కూడా ఏఐపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నవాళ్లు ఈ ఏఐపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ టెక్నాలజీ గురించి ఏ వార్త కనపడినా టక్కున క్లిక్ చేసి చదివేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ యాంకర్లకు ఎలా శిక్షణ ఇస్తారో తెలుసుకోండి..! Allkpop అమెరికా న్యూస్ సైట్ ఏఐ యాంకర్ AI న్యూస్ యాంకర్ అంటే? AI న్యూస్ యాంకర్లు అలసిపోకుండా, విరామం తీసుకోకుండా 24/7 పని చేయగలరు. మల్టి లాంగ్వేజస్‌లో న్యూస్‌ని చదవగలరు. డీప్ లెర్నింగ్ టెక్నాలజీతో పాటుAI అల్గారిథమ్‌లు ద్వారా ఈ యాంకర్లు పని చేస్తారు. రియల్ న్యూస్ యాంకర్లు చదివినట్టే వీళ్లు కూడా వార్తను ప్రజెంట్ చేయగలరు. ఫేషియల్ ఎక్స్‌ప్రషన్స్ ఇస్తూ నిజమైన యాంకర్ చదువుతున్నట్టే అనిపించేలా చేస్తారు. ఏఐ యాంకర్‌కి ఎలా శిక్షణ ఇస్తారు..? స్టెప్ 1: ముందుగా యాంకర్ రూపం ఎలా ఉండాలన్నది డిసైడ్ అవ్వండి..దానికి సంబంధించిన డేటాను రెడీ చేసుకోండి.. తర్వాత యాంకర్ ఏం చదవాలో ఆ స్క్రిప్ట్‌లను కూడా సిద్ధం చేయండి. స్టెప్ 2: AI మోడల్‌కు శిక్షణ ఇవ్వండి: AI మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించడం తర్వాత దశ. ఒరిజినల్ న్యూస్ యాంకర్ రూపాన్ని, వాయిస్, ఎక్స్‌ప్రషెన్స్ మనం క్రియేట్ చేసుకున్న మోడల్ గుర్తుపట్టేలా చేయాలి. అందుకు అల్గారిథమ్‌ని తయారు చేయాలి. స్టెప్ 3: AI మోడల్‌కు శిక్షణ ఇచ్చిన తర్వాత, న్యూస్ యాంకర్ డిజిటల్ రూపాన్ని సృష్టించండి. నిజమైన న్యూస్ యాంకర్‌లా కనిపించేలా, వాయిస్ వినిపించేలా చేయాలి. స్టెప్ 4: AI యాంకర్ చదవాల్సిన న్యూస్ స్క్రిప్ట్‌లను చదివేలాగా అల్గారిథమ్‌ని సెట్ చేయాలి.. ఆ తర్వాత దాన్ని వీడియో ఫార్మెట్‌లోకి మార్చాలి. ఏ టూల్స్ ఉపయోగిస్తారు..? AI న్యూస్ యాంకర్ వీడియోని క్రియేట్ చేయడానికి చాలా టూల్స్ అందుబాటులో ఉండగా..అందులో ప్రధానంగా నాలుగు టూల్స్‌ని ఉపయోగించుకోవచ్చు. 1) డీప్‌ఫేక్ స్టూడియో : డీప్‌ఫేక్ వీడియోలను రూపొందించడానికి ఉపయోగించే టూల్. 2) సింథేసియా : AI న్యూస్ యాంకర్ వీడియోలను రూపొందించడానికి ఉపయోగించే AI- పవర్డ్ వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫారమ్. 3) Lumen5 : టెక్స్ట్ నుంచి వీడియోలను రూపొందించడానికి AIని ఉపయోగించే వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫామ్. 4) Wibbitz : న్యూస్ వీడియోలను రూపొందించడానికి ఉపయోగించే AI ఎనర్జీతో కూడిన వీడియో క్రియేట్ ప్లాట్‌ఫామ్. ఈ టూల్స్ ఉపయోగించడానికి వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చు అన్నది మన అవసరాన్ని బట్టి మారుతుంది. ఏ వార్తా సంస్థలు AI న్యూస్ యాంకర్‌లను ఉపయోగించడం ప్రారంభించాయి? ఇప్పటి వరకు అనేక వార్తా సంస్థలు AI న్యూస్ యాంకర్లను యూజ్ చేయడం స్టార్ట్ చేయగా.. చైనాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీ అయిన జిన్‌హువా న్యూస్ ఏజెన్సీ 2018లో తన మొదటి AI న్యూస్ యాంకర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్ కూడా AI న్యూస్ యాంకర్‌ను తీసుకొచ్చింది. ఇక ఇటివలి మన ఇండియాలోని దక్షణ భారత్ దేశంలోనూ ఈ ఏఐ న్యూస్ యాంకర్లు స్క్రీన్‌పై మెరిశారు. ఒడిశా టీవీ, తెలుగులో బిగ్‌టీవీ ఏఐ న్యూస్ యాంకర్లను ప్రేక్షకులకు పరిచయం చేసింది. AI న్యూస్ యాంకర్లతో ప్రయోజనం ఏంటి..? 1) AI న్యూస్ యాంకర్లు అలసిపోకుండా, విరామం అవసరం లేకుండా 24/7 పని చేయగలరు. 2) AI న్యూస్ యాంకర్‌లు వివిధ భాషల్లో, డిఫరెంట్ స్టైల్స్‌లో వార్తలను చదవగలరు. 3) కంపెనీలకు AI న్యూస్ యాంకర్లతో ఖర్చు తగ్గుతుందట! నెగిటివ్స్: 1) AI న్యూస్ యాంకర్‌లు రియల్ న్యూస్ రీడర్ల లాగా ఎమోషన్ క్యారీ చేయలేరు 2) ఓ మెషీన్ చదివినదాని కంటే ఓ మనిషి చదివినదానికే ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అవుతారు 3) అప్పటికప్పుడు వచ్చే బ్రేకింగ్ న్యూస్‌ని హ్యాండిల్ చేయడంలో..దాన్ని అనలైజ్ చేయడంలో మెషీన్ కంటే నార్మర్ న్యూస్ రీడరే బెస్ట్ 4) టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు వార్త తారుమారు అయ్యే ప్రమాదముంటుంది. 5) ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యే చాన్స్‌లు ఎక్కువ..ఎందుకంటే మెషీన్ కంట్రోల్ ఒకరి చేతిలో ఉండదు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి