మీ దంతాలు ముత్యాల్లా మెరవాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!

చిరునవ్వు..మనిషి అందాన్ని మరింత పెంచుతుంది. ఆ చిరునవ్వే ఎదుటివారిని ఆకర్షిస్తుంది. కానీ ఆ చిరునవ్వు అనేది దంతాల రంగుపై ఆధారపడి ఉంటుంది. దంతాలు తెల్లగా ముత్తాల్లా మెరుస్తుంటే ఆ నవ్వుకు మరింత అందం తోడవుతుంది. కానీ అదే దంతాలు పసుపు రంగుల్లో ఉంటే...మనస్పూర్తిగా నవ్వడం కూడా కష్టంగా మారుతుంది. అందుకే చాలా మంది తమ దంతాలను తెల్లగా మెరిసేలా ఉంచుకోవాలని ఎన్నో ప్రయత్నిస్తుంటారు. అయినా కూడా దంతాలపై ఉన్న పసుపు గారాలు తొలగిపోయి. దీంతో గిల్టీగా ఫీల్ అవుతుంటారు. అయితే మీ దంతలు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోవాలంటే మీ వంటగదిలో ఉన్న వస్తువులే చాలు. ఎలాంటి టూత్ పేస్టు అవసరం లేకుండానే మీ దంతాలను మెరిసేలా చేస్తాయి.

మీ దంతాలు ముత్యాల్లా మెరవాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!
New Update

ముఖంగా అందంగా ఉండాలంటే ముఖంపై చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వు ఆకర్షణీయంగా ఉండాలంటే తెల్లగా మెరిసేటి దంతాలు ఉండాలి. మీరు అందంగా ఉన్నా కూడా...దంతాలు పచ్చగా ఉన్నట్లయితే చూసేందుకు అస్సలు బాగుండదు. నలుగురిలో మనసారా నవ్వలేరు..మాట్లాడలేరు. దంతాలు తెల్లగా ఉంటేనే నలుగురిలో నవ్వుతారు...అందంగా కనిపిస్తారు. అంతేకాదు మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

publive-image

అయితే చాలా మంది పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.రోజుకు రెండు మూడు సార్లు బ్రష్ చేస్తుంటారు. అయినా కూడా పళ్లు తెల్లగా మారవు. అయితే మీ వంటగదిలో ఉండే ఈ వస్తువులతో మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. అవేంటో చూద్దాం.

దంతాలు కాంతివంతంగా మారాలంటే ఏం చేయాలి?

ఉప్పు:
దంతాల మీద నిక్షిప్తమైన పసుపు రంగును శుభ్రం చేయడంలో ఉప్పు ప్రయోజనకరంగా ఉంటుంది. దంతాల శుభ్రత కోసం, ఉప్పులో అల్లం పొడి, కొన్ని చుక్కల తేనె కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ మీ వేలితో 5 నిమిషాల పాటు దంతాలను రుద్దండి. దీని తరువాత, శుభ్రమైన నీటితో దంతాలను శుభ్రంచేయండి. ఇలా వారానికి కనీసం 4 సార్లు చేయండి.

ఉప్పు, ఆవ నూనె:
ఉప్పులో ఆవాల నూనె కలపడం వల్ల దంతాలపై ఉన్న పసుపు గారా తొలగిపోతుంది. దీని కోసం, అర టీస్పూన్ ఉప్పులో కొన్ని చుక్కల ఆవాల నూనెను కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను దంతాల మీద రుద్దండి. చివరగా, నీటితో శుభ్రం చేయండి. ఇలా చేస్తే 15 రోజుల్లో దంతాలు ముత్యాల్లా మెరుస్తాయి.

బేకింగ్ సోడా, నిమ్మకాయ:
దంతాలపై ఉన్న పసుపుగారాను బేకింగ్ సోడా, నిమ్మకాయతో కూడా తొలగించవచ్చు. దీని కోసం, 1 టీస్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను వేళ్లతో దంతాల మీద రుద్దండి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. దీంతో మీ దంతాలు మెరుస్తాయి.

కొబ్బరి నూనె:
ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో పోసుకుని పుకిలించాలి. నూనెను మింగకుండా 10 నిమిషాల పాటు అటూ ఇటూ బాగా పుక్కిలించిన తర్వాత నూనె ఉమ్మివేయాలి. తర్వాత మంచి నీటితో నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే దంతాలపై పాచి ఎక్కువగా పట్టదు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe