Science News : చనిపోయిన వారిని బతికించవచ్చా? ఆ కంపెనీ వందలాది శవాలను ఎందుకు భద్రపరుస్తుంది?

క్రయోప్రెజర్వేషన్ ప్రక్రియ ద్వారా చనిపోయిన వారిని బతికించవచ్చని అమెరికన్ కంపెనీ 'అల్కోర్' చెబుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే 233 మృతదేహాలను భద్రపరిచింది. జెనరేటివ్ మెడిసిన్ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వారిని బతికించేందుకు ఈ కంపెనీ ప్రయోగాలు చేస్తోంది.

Science News : చనిపోయిన వారిని బతికించవచ్చా? ఆ కంపెనీ వందలాది శవాలను ఎందుకు భద్రపరుస్తుంది?
New Update

వైద్య సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలమిది. అంతే కాకుండా ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులను నయం చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక చనిపోయిన వారిని కూడా మరుసటి రోజు బతికించవచ్చని ఓ కంపెనీ చెబుతోంది. అమెరికన్ కంపెనీ 'అల్కోర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్' ప్రపంచంలోని ప్రముఖ క్రయోనిక్స్ కంపెనీల్లో ఒకటి. ఇది చనిపోయిన వారిని తిరిగి బతికించే లక్ష్యంతో శవాలను భద్రపరుస్తుంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

శవాలను భద్రపరుస్తోన్న కంపెనీ:
చాలామందికి ఇది ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కాలంలో దేన్ని ఈజీగా కొట్టిపారేయలేం. ఈ ప్రయోగం కోసం ఆల్కార్ కంపెనీ ఇప్పటికే 233 మృతదేహాలను భద్రపరిచింది. ఈ భద్రపరిచిన శవాలను తిరిగి బతికించాలనే ఆశతో సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఆల్కోర్ ఉపయోగించే శాస్త్రాన్ని ఇప్పుడు 'క్రయోనిక్స్' అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో చనిపోయిన మానవ శరీరాలను ఫ్రీజర్‌లో తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. తర్వాత చికిత్స ద్వారా ఈ శవాలకు తిరిగి ప్రాణం పోసేందుకు కృషి చేస్తారు. ఇదే విషయాన్ని కంపెనీ చెబుతోంది. దీనివల్ల మనిషి ఆయుష్షు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు.

ఇది సాధ్యమా?
చనిపోయిన వ్యక్తిని బతికించడం సాధ్యమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో వైద్య శాస్త్రం ఇంత పురోగతి సాధిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అటు క్రయోప్రెజర్వేషన్ ప్రక్రియ మరణానికి కారణమయ్యే వ్యాధులను నయం చేయగలదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే నానోటెక్నాలజీ , జెనరేటివ్ మెడిసిన్ టెక్నాలజీ ద్వారా ఇది సమీప భవిష్యత్తులో సాధ్యమవుతుందని కంపెనీ అంటోంది. అయితే ఒక వ్యక్తిని మరణం నుంచి బతికించడమంటే మాముల విషయం కాదు. అటు డెడ్‌ బాడీ పరిరక్షణకు కూడా చాలా డబ్బు ఖర్చవుతుంది. దీనికి నిధులు సమకూర్చేందుకు ఆల్కార్ ట్రస్ట్ ఫండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసింది. ఇది క్రియోప్రెజర్డ్ బాడీలను భద్రపరచడానికి నిధులను అనుమతిస్తుంది. క్రయోప్రెజర్వేషన్ కోసం సభ్యత్వ రుసుములో కొంత భాగం ఈ ట్రస్ట్ ఫండ్‌లోకి వెళుతుంది. పూర్తి శరీర సంరక్షణ కోసం, ట్రస్ట్ 115,000 డాలర్లు (సుమారు రూ. 96 లక్షలు) చెల్లించాలి. మెదడు కుళ్లిపోకుండా (న్యూరో ప్రిజర్వేషన్) 25,000 డాలర్లు (దాదాపు రూ. 21 లక్షలు) ఇవ్వాలి. ఇలా ఇంత డబ్బులు ఇస్తే కానీ శవాన్ని భద్రపరచరు. ఇక ఆ శవాన్ని బతికించడం సాధ్యమేనా అంటే ఏమో ఇప్పటికైతే చెప్పలేం!

Also Read: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్‌ నుంచి ట్రంప్‌ వరకు.. !

#america
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe